Vaibhav Suryavanshi Aaron George Century: వైభవ్, ఆరోన్ శతకమోత
ABN , Publish Date - Jan 08 , 2026 | 06:04 AM
సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 127), ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 16 ఫోర్లతో 118) శతకాలతో మోతెక్కించడంతో.. దక్షిణాఫ్రికా అం డర్-19తో జరిగిన మూడు వన్డేల...
యువ భారత్ ఘన విజయం ఫ మూడో వన్డేలోనూ దక్షిణాఫ్రికా చిత్తు
యూత్ వన్డేల్లో సెంచరీ సాధించిన పిన్న వయసు కెప్టెన్‌గా 14 ఏళ్ల వైభవ్ ప్రపంచ
రికార్డు సృష్టించాడు
బెనోని: సూపర్ ఫామ్‌లో ఉన్న వైభవ్ సూర్యవంశీ (74 బంతుల్లో 9 ఫోర్లు, 10 సిక్స్‌లతో 127), ఆరోన్ జార్జ్ (106 బంతుల్లో 16 ఫోర్లతో 118) శతకాలతో మోతెక్కించడంతో.. దక్షిణాఫ్రికా అం డర్-19తో జరిగిన మూడు వన్డేల సిరీ్‌సను యు వ భారత్ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. బుధవారం జరిగిన మూడో, ఆఖరి మ్యాచ్‌లో భారత్ 233 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 393/7 స్కోరు చేసింది. ఎన్‌టాన్‌డన్ సోనీ మూడు వికె ట్లు పడగొట్టాడు. ఛేదనలో సౌతాఫ్రికా 35 ఓవర్లలో 160 పరుగులకే కుప్పకూలింది. పేసర్ కిషన్ సింగ్ (3/15) దెబ్బకు.. 50/5తో టాపార్డర్‌ను కోల్పోయిన దక్షిణాఫ్రికా ఏదశలోనూ ఛేదించే విధంగా కనిపించలేదు. డేనియల్ బోస్‌మన్ (40), పాల్ జేమ్స్ (41), కోర్నీ బోతా (36 నాటౌట్) కొంతసేపు పోరాడారు.
చెలరేగిన వైభవ్..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు ఆరోన్, కెప్టెన్ వైభవ్ అదిరే ఆరంభాన్నిచ్చారు. సూర్యవంశీ ఎడాపెడా షాట్లతో విరుచుకుపడగా.. మరో ఎండ్‌లో జార్జ్ సమన్వయంతో ఆడుతూ స్కోరు బోర్డును నడిపించాడు. ఈ క్రమంలో ఇద్దరూ శతకాలు పూర్తి చేశారు. అయితే, 26వ ఓవర్‌లో వైభవ్‌ను సోనీ అవుట్ చేయడంతో.. తొలి వికెట్‌కు 227 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆరోన్‌ను రౌల్స్ పెవిలియన్ చేర్చాడు. వేదాంత్ త్రివేది (34), అభిజ్ఞాన్ కుండూ (21), మహ్మద్ ఎనాన్ (28 నాటౌట్), హనిల్ పటేల్ (19 నాటౌట్)లు టీమ్ స్కోరును 400కు చేరువ చేశారు.
సెంచరీలే సెంచరీలు
చిచ్చరపిడుగు వైభవ్ పరుగుల వరద పారిస్తున్నాడు. క్రమం తప్పకుండా భారీ స్కోర్లు సాధిస్తూ సెలెక్టర్ల దృష్టిని తనవైపు తిప్పుకొంటున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి అతడు ఇప్పటికి 9 శతకాలు బాదాడు. యూత్ టెస్ట్‌ల్లో రెండు, యూత్ వన్డేల్లో మూడు సెంచరీలు నమోదు చేశాడు. గతేడాది ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌పై శతకం సాధించాడు.
సంక్షిప్త స్కోర్లు
భారత్: 50 ఓవర్లలో 393/7 (వైభవ్ 127, ఆరోన్ 118; సోనీ 3/61, రౌల్స్ 2/59); దక్షిణాఫ్రికా: 35 ఓవర్లలో 160 ఆలౌట్ (జేమ్స్ 41, బోస్‌మన్ 40; కిషన్ 3/15, ఎనాన్ 2/36).
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్