Share News

Usain Bolt Cricket In Olympics 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడతా

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:25 AM

కరీబియన్‌ దిగ్గజ అథ్లెట్‌, మూడు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన జమైకా చిరుత ఉస్సేన్‌ బోల్ట్‌ తనకు క్రికెట్‌ ఆడాలని ఉందంటూ మనసులో మాట...

Usain Bolt Cricket In Olympics 2028: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ ఆడతా

జమైకా: కరీబియన్‌ దిగ్గజ అథ్లెట్‌, మూడు ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన జమైకా చిరుత ఉస్సేన్‌ బోల్ట్‌ తనకు క్రికెట్‌ ఆడాలని ఉందంటూ మనసులో మాట బయట పెట్టాడు. 2028 లాస్‌ ఏంజెల్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌కు చోటు కల్పించడంతో అన్నీ కలిసొస్తే మరోసారి బోల్ట్‌ ఒలింపిక్స్‌లో ఆడే అవకాశం ఉంది. ‘ప్రొఫెషనల్‌ క్రీడా జీవితానికి సంతోషంగా వీడ్కోలు పలికా. నేను క్రికెట్‌ ఎక్కువ కాలం ఆడలేదు కానీ ఆ క్రీడంటే చాలా మక్కువ. మా దేశ క్రికెట్‌ బోర్డు నన్ను సంప్రదిస్తే క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా’ అని బోల్ట్‌ తెలిపాడు. వాస్తవానికి బోల్ట్‌ క్రీడా జీవితం పేస్‌ బౌలర్‌గానే మొదలైంది. అప్పటి పరిస్థితుల దృష్ట్యా బోల్ట్‌ క్రికెట్‌ నుంచి అథ్లెటిక్స్‌కు తన దిశను మార్చుకున్నాడు. 2024లో అమెరికా, కరీబియన్‌ దీవులు సంయుక్తంగా ఆతిథ్యం ఇచ్చిన టీ20 వరల్డ్‌క్‌పనకు బోల్ట్‌ ప్రచారకర్తగా కూడా వ్యవహరించడం విదితమే.

ఇవి కూడా చదవండి:

రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?

అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..

Updated Date - Jan 20 , 2026 | 05:25 AM