భద్రత కారణాలతో వైదొలగిన అమెరికా అండర్-17
ABN , Publish Date - Nov 13 , 2026 | 02:15 AM
ఫిఫా అండర్-17 బాలుర ప్రపంచ కప్‌నుంచి అమెరికా జట్టు వైదొలగింది. భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది...
ఫిఫా వరల్డ్ కప్
జెనీవా: ఫిఫా అండర్-17 బాలుర ప్రపంచ కప్‌నుంచి అమెరికా జట్టు వైదొలగింది. భద్రతా కారణాల దృష్ట్యా అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య ఈ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు అమెరికా నిర్ణయాన్ని అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) గురువారం ధ్రువీకరించింది. 48 జట్లు బరిలోకి దిగుతున్న ఈ ఫిఫా టోర్నమెంట్ దోహాలో వచ్చే బుధవారం ప్రారంభం కానుంది. అమెరికా జట్టు ఈనెల 21న మాంటెనెగ్రోతో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. గత ఫిబ్రవరిలో ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభించినప్పటి నుంచి ఖతార్, గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర అలజడి ఏర్పడిన సంగతి తెలిసిందే. ‘ప్రస్తుతం అమలులో ఉన్న మూడోస్థాయి ప్రయాణ హెచ్చరిక దృష్ట్యా అమెరికా ఫుట్‌బాల్ సమాఖ్య తీసుకున్న నిర్ణయాన్ని మేం అర్థం చేసుకోగలం’ అని ఫిఫా పేర్కొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మానసిక ఒత్తిడితోనే కుటుంబం ఆత్మహత్య
అటవీ అమరవీరుల త్యాగం మరువలేనిది: పవన్ కల్యాణ్
ఏపీ క్యాబినెట్ కీలక భేటీ.. 30కు పైగా అజెండా అంశాలపై సీఎం చర్చ