సెమీ్‌సలో జ్వెరెవ్, గాఫ్
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:36 AM
టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, అన్‌సీడెడ్ కరెన్ ఖచనోవ్, నాలుగో సీడ్ కొకొ గాఫ్ యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 7-5, 6-1తో...
ఆండ్రీవా అవుట్ జూయూఎస్ ఓపెన్
న్యూయార్క్: టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్, అన్‌సీడెడ్ కరెన్ ఖచనోవ్, నాలుగో సీడ్ కొకొ గాఫ్ యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించారు. గురువారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో జ్వెరెవ్ (జర్మనీ) 6-2, 7-5, 6-1తో జాండ్‌స్కల్ప్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించాడు. మరో క్వార్టర్‌ఫైనల్లో ఖచనోవ్ (రష్యా) 6-2, 7-5, 3-2తో ఆధిక్యంలో ఉన్న దశలో ప్రత్యర్థి అలెగ్జాండర్ (బెల్జియం) గాయంతో వైదొలగడంతో ముందంజ వేశాడు. శనివారం జరిగే సెమీ స్‌లో జ్వెరెవ్‌తో ఖచనోవ్ తలపడతాడు. రెండో సెమీస్‌లో అమెరికా స్టార్లు..ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ 11వ సీడ్ ఫ్రాన్సిస్ టియఫో ఢీకొంటారు. చివరి క్వార్టర్‌ఫైనల్లో నాలు గో సీడ్ గాఫ్ (అమెరికా) 2-6, 7-6 (7), 6-2తో ఐదో సీడ్, ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ మిర్రా ఆండ్రీవా (రష్యా)కు షాకిచ్చింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో రెండోసీడ్ ఎలెనా రిబకినా (కజకిస్థాన్)తో గాఫ్ అమీతుమీ తేల్చుకుంటుంది. మరో సెమీ్‌సలో టాప్‌సీడ్, డిఫెండింగ్ చాంపియన్ సబలెంక(బెలార్‌స)-పెగుల (అమెరికా) ఢీకొంటారు.
రిబకినా..నెంబర్ వన్ : ఎలెనా రిబకినా కెరీర్‌లో తొలిసారి ప్రపంచ నెం.1 ర్యాంక్‌ను దక్కించుకోనుంది. యూఎస్ ఓపెన్ సెమీఫైనల్లో ప్రవేశించిన దరిమిలా 27 ఏళ్ల రిబకినాకు టాప్‌ర్యాంక్ ఖాయమైంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి కజకిస్థాన్ క్రీడాకారిణిగా ఎలెనా రికార్డుల కెక్కనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ