Share News

స్టార్ల దూకుడు

ABN , Publish Date - Sep 03 , 2026 | 04:50 AM

యూఎస్‌ ఓపెన్‌లో మహిళల స్టార్లు సులువుగా ముందంజ వేయగా, పురుషుల టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తొలి రౌండ్‌ను దాటేందుకు ఐదు సెట్లపాటు పోరాడాడు. ఇక, మహిళల 12వ సీడ్‌...

స్టార్ల దూకుడు

మూడో రౌండ్‌కు మెద్వెదెవ్‌జూ జ్వెరెవ్‌, ఆండ్రీవా ముందంజ

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో మహిళల స్టార్లు సులువుగా ముందంజ వేయగా, పురుషుల టాప్‌ సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ తొలి రౌండ్‌ను దాటేందుకు ఐదు సెట్లపాటు పోరాడాడు. ఇక, మహిళల 12వ సీడ్‌ బెలిండా బెన్సిక్‌ మొదటి రౌండ్‌లోనే వెనుదిరగడం బుధవారంనాటి పోటీల్లో సంచలనం. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో ఇటలీకి చెందిన అన్‌సీడెడ్‌ ఆటగాడు లొరెంజో సొనెగో.. ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత జ్వెరెవ్‌కు గట్టిపోటీ ఇచ్చాడు. దాదాపు ఐదు గంటలపాటు సాగిన మారథాన్‌ పోరులో జ్వెరెవ్‌ 6-3, 3-6, 6-7 (9), 7-5, 6-4తో లోరెంజోపై గెలిచి ఊపిరి పీల్చుకున్నాడు. ఇక, 13వ సీడ్‌ లోరెంజో ముసెట్టి 6-3, 6-3, 7-5తో ఆర్థర్‌ ఫెరీపై అలవోకగా నెగ్గి రెండో రౌండ్‌ చేరాడు. రెండో రౌండ్లో ఏడోసీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ 6-1, 6-3, 7-5తో సెబాస్టియన్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్‌లో ఈ ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌తో తొలి గ్రాండ్‌స్లామ్‌ను అందుకున్న ఐదో సీడ్‌, 19 ఏళ్ల మిర్రా ఆండ్రీవా 6-2, 6-2తో జానెస్‌ జెన్‌పైను సులువుగా ఓడించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. మిగతా వారిలో వరల్డ్‌ నెంబర్‌ టూ ఎలెనా రిబకినా 6-3, 6-2తో థియా ఫ్రోడిన్‌పై, నాలుగో సీడ్‌ కొకొ గాఫ్‌ 6-3, 6-4తో సొన్మెజ్‌పై గెలిచి రెండో రౌండ్‌ చేరినవారిలో ఉన్నారు. కాగా, మూడో సీడ్‌ జెస్సికా పెగుల 6-3, 6-1తో కెనిన్‌పై, 15వ సీడ్‌ డయానా ష్నిదెర్‌ 6-1, 7-6 (4)తో ప్లిస్కోవాపై, 16వ సీడ్‌ సొరానా సిర్‌స్టియా 6-2, 7-5తో పెర్రీపై, 19వ సీడ్‌ జాస్మిన్‌ పౌలిని 6-4, 6-1తో స్టెఫానినిపై నెగ్గి మూడో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇక, కజకిస్థాన్‌కు చెందిన అన్‌సీడెడ్‌ యులియా పుతింత్సేవా 4-6, 7-5, 6-3తో 12వ సీడ్‌ బెలిండా బెన్సిక్‌కు షాకిచ్చింది.

ఈ వార్తలనూ చదవండి:

ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో జగిత్యాల వాసి మృతి

వియన్నా మ్యూజియంలో భారీ దోపిడీ.. రూ.38 కోట్ల విలువైన వజ్రాల హారం చోరీ..

Updated Date - Sep 03 , 2026 | 04:50 AM