Share News

పెగుల శుభారంభం

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:40 AM

యూఎస్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ జెస్సికా పెగుల శుభారంభం అందుకుంది. అలాగే జాస్మిన్‌ పోలిని కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించింది...

పెగుల శుభారంభం

క్రెజికోవాకు షాక్‌ జూయూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో మూడో సీడ్‌ జెస్సికా పెగుల శుభారంభం అందుకుంది. అలాగే జాస్మిన్‌ పోలిని కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించింది. అయితే రెండు గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌ బార్బరా క్రెజికోవా మొదటి రౌండ్‌లో షాక్‌ తగిలింది. ఆదివారం జరిగిన తొలి రౌండ్‌లో.. పెగుల (అమెరికా) 6-3, 6-2తో ఎలెనా రూస్‌ (రొమేనియా)పై నెగ్గింది. మరో మ్యాచ్‌లో..2024 ఫ్రెంచ్‌, వింబుల్డన్‌ ఫైనలిస్ట్‌ పోలిని (ఇటలీ)తో 6-3, 3-6, 6-4తో వెరోనిక (స్లొవేనియా)పై గెలుపొందింది. అయితే కమిల్లా రఖినోవా (రష్యా/ఉజ్బెకిస్థాన్‌) 7-6(4), 6-2తో ఫ్రెంచ్‌ ఓపెన్‌, వింబుల్డన్‌ చాంపియన్‌ క్రెజికోవా (చెక్‌ రిపబ్లిక్‌)కు ఝలకిచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:40 AM