Share News

ఫైనల్లో సబలెంక, రిబకినా

ABN , Publish Date - Sep 12 , 2026 | 06:22 AM

ఈసారి యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ నలుగురు సీడెడ్‌లు అర్యాన సబలెంక, ఎలెనా రిబకినా, జెస్సికా పెగుల, కొకొ గాఫ్‌ తలపడడం అత్యంత ఆసక్తికర అంశం...

ఫైనల్లో  సబలెంక, రిబకినా

సెమీస్‌లో పెగుల, గాఫ్‌ అవుట్‌

యూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: ఈసారి యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో టాప్‌ నలుగురు సీడెడ్‌లు అర్యాన సబలెంక, ఎలెనా రిబకినా, జెస్సికా పెగుల, కొకొ గాఫ్‌ తలపడడం అత్యంత ఆసక్తికర అంశం. వీరిలో ఒకటి, రెండు సీడెడ్‌లు విజయాలు సాధించగా.. మూడు, నాలుగు సీడెడ్‌లు పరాజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ తొలి సెమీఫైనల్లో టాప్‌సీడ్‌ సబలెంక (బెలారస్‌) 7-5, 6-2తో మూడో సీడ్‌ పెగుల (అమెరికా)పై గెలిచి వరుసగా మూడో ఏడాది ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరో సెమీ్‌సలో రెండో సీడ్‌ రిబకినా (కజకిస్థాన్‌) 3-6, 6-4, 6-4తో నాలుగో సీడ్‌ కొకొ గాఫ్‌ (అమెరికా)పై నెగ్గింది. ఇక ఆదివారం జరిగే తుదిపోరు ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ ఫైట్‌ను పునరావృతం చేయనుంది. ఈ జనవరిలో జరిగిన సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఫైన ల్లో సబలెంక-రిబకినా తలపడగా.. రిబకినా విజేతగా నిలిచింది. మరి.. ఈసారి ఎవరిది పైచేయి కానుందో చూడాలి. పైగా, ఇప్పటిదాకా ప్రపంచ రెండో ర్యాంకులోనున్న రిబకినా.. యూఎస్‌ ఓపెన్‌లో సెమీస్‌ చేరడంతోనే సబలెంక నుంచి టాప్‌ ర్యాంక్‌ను

ఖరారు చేసుకుంది.

సబలెంక అలా.. రిబకినా ఇలా..: యూఎస్‌ ఓపెన్‌లో తన జోరు కొనసాగిస్తూ పెగులపై సబలెంక అలవోకగా నెగ్గింది. కానీ, గాఫ్‌తో పోరులో మాత్రం రిబకినా చెమటోడ్చింది. మొదటి సెట్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంతో గాఫ్‌ మిగిలిన రెండు సెట్లలో పోరాడింది. రెండో సెట్‌లో 1-4తో వెనుకంజలో నిలిచిన గాఫ్‌..అద్భుతంగా పుంజుకొని 4-4తో స్కోరు సమం చేసింది. కానీ తదుపరి రెండు గేమ్‌లను నెగ్గిన రిబకినా మ్యాచ్‌ను మూడో సెట్‌కు మళ్లించింది. నిర్ణాయక సెట్‌లో 5-3తో కజక్‌ స్టార్‌..మ్యాచ్‌ పాయింట్‌పై నిలిచింది. కానీ రిబకినా సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన గాఫ్‌ పోటీలోకి వచ్చింది. అయితే, ప్రత్యర్థికి మరో చాన్సివ్వకుండా రిబకినా మ్యాచ్‌ను ముగించింది.


డబుల్స్‌ సెమీస్‌లో మాయా జోడీ

భారత్‌కు చెందిన మాయా రాజేశ్వరన్‌ రేవతి/ఆంటోనినా సుష్కోవా (ఉక్రెయిన్‌) ద్వయం యూఎస్‌ ఓపెన్‌ జూనియర్‌ బాలికల సెమీఫైనల్లో అడుగుపెట్టింది. క్వార్టర్‌ఫైనల్లో రేవతి/సుష్కోవా జంట 6-4, 6-4తో నాలుగో సీడ్‌ రష్యా జోడీ డోరోఫీవా రిబా్‌స/అనా పుష్కరేవాకు షాకిచ్చింది.

ఈ వార్తలు కూడా చదవండి

ఆర్‌డబ్ల్యూఎస్‌ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..

2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Updated Date - Sep 12 , 2026 | 06:22 AM