Share News

స్విటోలినా, ముచోవా ఇంటికి

ABN , Publish Date - Sep 06 , 2026 | 05:43 AM

యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ముగ్గురు టాప్‌ స్టార్లకు షాక్‌ తగిలింది. ఏడో సీడ్‌ కరోలినా ముచోవా, తొమ్మిదో సీడ్‌ స్విటోలినా, పదో సీడ్‌ అనిసిమోవా..

స్విటోలినా, ముచోవా ఇంటికి

యూఎస్‌ ఓపెన్‌

ప్రీక్వార్టర్స్‌లో అల్కారజ్‌, మెద్వెదెవ్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ మూడో రౌండ్‌లో ముగ్గురు టాప్‌ స్టార్లకు షాక్‌ తగిలింది. ఏడో సీడ్‌ కరోలినా ముచోవా, తొమ్మిదో సీడ్‌ స్విటోలినా, పదో సీడ్‌ అనిసిమోవా, 22వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌ ఇంటిముఖం పట్టారు. 26వ సీడ్‌ ఎమ్మా నవారో 6-3, 7-5తో ముచోవాను, 21వ సీడ్‌ కలిన్‌స్కయా 6-3, 2-6, 6-3తో స్విటోలినాను, 24వ సీడ్‌ పొటపోవా 6-2, 7-5తో అనిసిమోవాను, కిన్వెన్‌ జెంగ్‌ 1-6, 7-6(3), 7-5తో కీస్‌ను కంగుతినిపించి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఆరో సీడ్‌ లిండా నొస్కోవా 6-2, 6-7 (8), 6-2తో అన్‌ లీని ఓడించి నాలుగో రౌండ్‌లో అడుగుపెట్టింది. ఇక, పురుషుల డిఫెండింగ్‌ చాంపియన్‌ కార్లోస్‌ అల్కారజ్‌ టైటిల్‌ నిలబెట్టుకొనే దిశగా సాగుతున్నాడు. మూడో రౌండ్‌లో అల్కారజ్‌ 6-3, 6-4, 6-1తో ఊ యీబింగ్‌పై సులువుగా నెగ్గి ప్రీక్వార్టర్స్‌ చేరాడు. మిగతా స్టార్‌ ఆటగాళ్లలో మెద్వెదెవ్‌ 6-4, 6-4, 6-4తో రిండెర్‌కెంచ్‌పై, బెన్‌ షెల్టన్‌ 7-6 (3), 6-7 (7), 6-3, 6-4తో షపోవలోవ్‌పై, టియఫో 6-4, 6-2, 6-4తో వాచెరాట్‌పై, టామీ పాల్‌ 6-4, 3-6, 6-7 (7), 6-1, 6-3తో 15వ సీడ్‌ బబ్లిక్‌పై నెగ్గి ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు.

ఇవి కూడా చదవండి

మల్కాజిగిరి నియోజకవర్గంలో 48,505 మందికి ‘సర్‌’ నోటీసులు

సీఎంతో చర్చలు ఫలప్రదంగా ముగిస్తాయని ఆశిస్తున్నాం: ఏపీ ఎన్జీవో చీఫ్ విద్యాసాగర్

Updated Date - Sep 06 , 2026 | 05:43 AM