Uppala Praneeth Chess: విజేత ప్రణీత్
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:54 AM
రోక్వెటాస్ చెస్ ఫెస్టివల్ టైటిల్‌ను హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ఉప్పాల ప్రణీత్ కైవసం చేసుకున్నాడు...
అల్మేరియా (స్పెయిన్): రోక్వెటాస్ చెస్ ఫెస్టివల్ టైటిల్‌ను హైదరాబాద్ గ్రాండ్‌మాస్టర్ ఉప్పాల ప్రణీత్ కైవసం చేసుకున్నాడు. మొత్తం 151 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో ప్రణీత్ 7.5 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకుని విజేతగా నిలిచాడు. తొమ్మిది రౌండ్లలో ప్రణీత్ ఏడు విజయాలు, ఒక డ్రా, మరో పరాజయంతో ముగించాడు. మారిన్ పెరాగౌట్ (స్పెయిన్) రన్నరప్, కుకోరోవ్స్కీ ఫిలిప్ (పోలెండ్) తృతీయ స్థానాల్లో నిలిచారు. మరో తెలుగు జీఎం రాజా రిత్విక్‌కు 10వ స్థానం దక్కింది.
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్