Share News

UP Warriorz Squad Ahead of WPL: జట్టు మారింది.. వ్యథ తీరేనా

ABN , Publish Date - Jan 08 , 2026 | 06:01 AM

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అత్యంత పేలవ ప్రదర్శనతో యూపీ వారియర్స్‌ నిరాశపరుస్తోంది. గతేడాది దీప్తి శర్మ నేతృత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో...

UP Warriorz Squad Ahead of WPL: జట్టు మారింది.. వ్యథ తీరేనా

యూపీ వారియర్స్‌

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో అత్యంత పేలవ ప్రదర్శనతో యూపీ వారియర్స్‌ నిరాశపరుస్తోంది. గతేడాది దీప్తి శర్మ నేతృత్వంలో బరిలోకి దిగిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది. దీంతో ఈసారి దేశవాళీ యువ క్రికెటర్‌ శ్వేతా సెహ్రావత్‌ మినహా అందరినీ వేలంలోకి వదిలేసింది. ఏకంగా రూ.14.5 కోట్ల పర్స్‌తో వేలంలోకి అడుగుపెట్టిన యూపీ తమ జట్టును పవర్‌ హిట్టర్లు, ఆల్‌రౌండర్లు, అనుభవజ్ఞులైన బౌలర్లతో పునర్‌ నిర్మించుకుంది. ఇక మెగ్‌ లానింగ్‌ను కొనుగోలు చేసి జట్టు పగ్గాలు అప్పజెప్పడం కీలక మలుపుగా చెప్పవచ్చు. అంతేకాకుండా మాజీ కెప్టెన్‌ దీప్తి శర్మను అత్యధికంగా రూ.3.20 కోట్లు వెచ్చించి ఆర్‌టీఎం ద్వారా తిరిగి దక్కించుకుంది.

లానింగ్‌ కెప్టెన్సీ బలంతో..: మెగ్‌ లానింగ్‌ గత మూడు పర్యాయాలు ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌గా జట్టును ఫైనల్స్‌కు చేర్చగలిగింది. ఇక దీప్తి శర్మ తన స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిస్తే జట్టుకు తిరుగుండదు. దీనికి తోడు సోఫీ ఎకెల్‌స్టోన్‌, ఆశా శోభన, దీప్తిలతో కూడిన స్పిన్‌ విభాగం వడోదర పిచ్‌పై ఇబ్బంది పెట్టగలదు. ఓపెనర్‌ కిరణ్‌ నవ్‌గిరె, హర్లీన్‌, డాటిన్‌ బ్యాటింగ్‌లో కీలకం కానున్నారు.

పేస్‌లో ఇబ్బంది: యూపీ జట్టులో నైపుణ్యం కలిగిన స్పిన్నర్లకు కొదవ లేకపోయినా.. పేస్‌ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది. పేసర్‌ క్రాంతి గౌడ్‌పై అధికంగా ఆధారపడనుంది. ఇక పేస్‌ ఆల్‌రౌండర్‌ డియాండ్రా డాటిన్‌పై మధ్య ఓవర్లలో ఆశలు పెట్టుకుంది. ఓపెనర్‌ ప్రతీక గాయంతో బాధపడుతోంది.

జట్టు: స్వదేశీ: దీప్తి శర్మ, కిరణ్‌, క్రాంతి గౌడ్‌, సిమ్రన్‌, శ్వేత సెహ్రావత్‌, ఆశా శోభన, హర్లీన్‌, ప్రతీకా రావల్‌, శిఖా పాండే, శిప్రా గిరి, సుమన్‌ మీనా, జి. త్రిష.

విదేశీ: మెగ్‌ లానింగ్‌, లిచ్‌ఫీల్డ్‌, చార్లి నాట్‌, క్లో ట్రియోన్‌, డాటిన్‌, ఎకెల్‌స్టోన్‌.

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇవీ చదవండి:

కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్

కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్

మహిళల ప్రీమియర్‌ లీగ్‌ రేపటి నుంచే

Updated Date - Jan 08 , 2026 | 06:01 AM