Fifth Ashes Test: హెడ్, స్మిత్ శతకాలు
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:45 AM
ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (129) సెంచరీలతో అదరగొట్టడంతో.. యాషెస్ సిరీ్‌సలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో, ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా...
సిడ్నీ: ట్రావిస్ హెడ్ (163), స్టీవ్ స్మిత్ (129) సెంచరీలతో అదరగొట్టడంతో.. యాషెస్ సిరీ్‌సలో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో, ఆఖరి టెస్ట్‌లో ఆస్ట్రేలియా 134 పరుగుల ఆధిక్యాన్ని అందుకుంది. ఆటకు మూడో రోజైన మంగళవారం ఓవర్‌నైట్ స్కోరు 166/2తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 7 వికెట్లకు 518 పరుగులు చేసింది. కార్స్ మూడు, స్టోక్స్ రెండు వికెట్లు పడగొట్టారు. క్రితం రోజు బ్యాటర్ హెడ్ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న ఉస్మాన్ ఖవాజా (17) స్వల్ప స్కోరుకే కార్స్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌటైంది.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్