చివరి రెండు టీ20లకూ తిలక్ దూరం
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:17 AM
భారత మిడిలార్డర్ ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సిరీ్‌సకు ముందే గాయపడిన తను..
జట్టుతో పాటే శ్రేయాస్
న్యూఢిల్లీ: భారత మిడిలార్డర్ ఆటగాడు తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీ్‌సకు పూర్తిగా దూరమయ్యాడు. ఈ సిరీ్‌సకు ముందే గాయపడిన తను శస్త్రచికిత్స చేయించుకుని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఏ) పునరావాస శిబిరంలో కోలుకుంటున్నాడు. అయితే పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు మరింత సమయం పడుతుందని బీసీసీఐ ప్రకటించింది. మొదట తొలి మూడు మ్యాచ్‌లకు తిలక్ అందుబాటులో ఉండడని ప్రకటించిన సెలెక్టర్లు అతడి స్థానంలో శ్రేయాస్ అయ్యర్‌ను ఎంపిక చేశారు. తాజా పరిస్థితుల్లో మిగిలిన రెండు మ్యాచ్‌లకు కూడా అయ్యర్ జట్టుతో పాటే ఉండనున్నాడు. మరోవైపు మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాక టీ20 వరల్డ్‌కప్ కోసం వచ్చే నెల మూడున భారత జట్టుతో పాటు కలవనున్నాడు. ముంబైలో 4న దక్షిణాఫ్రికాతో జరిగే ఏకైక వామప్ మ్యాచ్‌లో అతను ఆడే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ