మహిళలకు కఠిన పరీక్ష
ABN , Publish Date - Apr 24 , 2026 | 01:30 AM
ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌ను మరోసారి ముద్దాడాలని భారత పురుషుల జట్టు పట్టుదలతో ఉండగా.. ఉబెర్ కప్‌లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన...
మరో టైటిల్‌పై పురుషుల గురి
నేటి నుంచి థామస్, ఉబెర్ కప్
హోర్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్ఠాత్మక థామస్ కప్‌ను మరోసారి ముద్దాడాలని భారత పురుషుల జట్టు పట్టుదలతో ఉండగా.. ఉబెర్ కప్‌లో గతంలో కంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాలని మహిళల జట్టు భావిస్తోంది. శుక్రవారం థామస్, ఉబెర్ కప్ ఫైనల్స్ మొదలుకానున్నాయి. గ్రూప్-ఎలో కెనడా, ఆస్ర్టేలియా, చైనాతో భారత్ తలపడనుంది. గ్రూప్ దశలో టాప్-2లో నిలిచిన జట్లు నాకౌట్‌కు చేరతాయి. భారత పురుషుల జట్టులో వర్ధమాన షట్లర్ ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్, హెచ్‌ఎ్‌స ప్రణయ్, కిడాంబి శ్రీకాంత్‌తోపాటు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి, ఎంఆర్ అర్జున్-హరిహరన్ జోడీలు ఆడనున్నాయి. నాలుగేళ్ల క్రితం టైటిల్‌తో సంచలనం సృష్టించిన భారత్.. ఆ తర్వాతి ఈవెంట్‌లో క్వార్టర్స్‌లో ఓడింది. కాగా, ఉబెర్ కప్‌లో మహిళల జట్టుకు వెటరన్ పీవీ సింధు సారథ్యం వహించనుండగా.. ఉన్నతి హుడా, తన్వీ శర్మ, దేవిక, ఇస్రాని బారువా, శ్రుతి మిశ్రా, ప్రియ, సిమ్రన్ సింగ్, తనీషా క్రాస్టో, కవిప్రియ సభ్యులుగా ఉన్నారు. గ్రూప్-ఎలో డెన్మార్క్, ఉక్రెయిన్, చైనాతో భారత్ తలపడనుంది.
షెడ్యూల్
థామస్ కప్ - గ్రూప్-ఎ
ఈ నెల 24న భారత్‌గీకెనడా మ. 12 నుంచి
27న భారత్‌గీఆస్ట్రేలియా మ. 12 నుంచి
29న భారత్‌గీచైనా మ. 1.30 నుంచి
ఉబెర్ కప్ - గ్రూప్-ఎ
ఈ నెల 24న భారత్‌గీడెన్మార్క్ మ. 3.30 నుంచి
25న భారత్‌గీఉక్రెయిన్ రాత్రి 10 నుంచి
27న భారత్‌గీచైనా రాత్రి 10 నుంచి
ఇవి కూడా చదవండి:
చెన్నై జట్టులోకి యార్కర్ల స్పెషలిస్ట్ ఎంట్రీ
చెన్నై సూపర్ కింగ్స్ ప్లేయర్ ఇంట విషాదం