Share News

టీజీ20 లోగో ఆవిష్కరణ

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:43 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ20 టోర్నమెంట్‌ లోగోను సినీ నటుడు...

టీజీ20 లోగో ఆవిష్కరణ

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ20 టోర్నమెంట్‌ లోగోను సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్‌, మాజీ క్రికెటర్‌ అంబటి రాయుడు ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లో క్రికెట్‌ ప్రముఖుల మధ్య ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. వచ్చే జూన్‌-జూలైలో 21 రోజుల పాటు ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఈ లీగ్‌లో 8 జట్లు తలపడనున్నాయి. తెలంగాణ క్రికెట్‌లో ఈ లీగ్‌ విప్లవాత్మక మార్పులను తీసుకురానుందని బీసీసీఐ కార్యవర్గ సభ్యుడు చాముండేశ్వర్‌నాథ్‌ అన్నారు. రాష్ట్రంలోని ప్రతిభావంతులైన క్రికెటర్లకు తమ సత్తాను నిరూపించుకునేందుకు ఈ లీగ్‌ ఒక మంచి వేదికని హెచ్‌సీఏ కార్యదర్శి మన్నె జీవన్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో రాష్ట్ర క్రీడాశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ జయేష్‌ రంజన్‌, డీజీపీ సీవీ ఆనంద్‌, మాజీ క్రికెటర్లు శివ్‌లాల్‌ యాదవ్‌, అర్షద్‌ అయూబ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

Updated Date - Apr 30 , 2026 | 03:43 AM