Share News

ప్రీక్వార్టర్స్‌కు తన్వీ

ABN , Publish Date - Aug 06 , 2026 | 04:07 AM

ఇటీవలే తైపీ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న భారత వర్ధమాన షట్లర్‌ తన్వీ శర్మ కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. ఇక, వెటరన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌...

ప్రీక్వార్టర్స్‌కు తన్వీ

  • కిడాంబి అవుట్‌

  • కొరియా ఓపెన్‌

అసన్‌ (కొరియా): ఇటీవలే తైపీ ఓపెన్‌ నెగ్గి జోరుమీదున్న భారత వర్ధమాన షట్లర్‌ తన్వీ శర్మ కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. ఇక, వెటరన్‌ స్టార్‌ కిడాంబి శ్రీకాంత్‌ ఆదిలోనే ఇంటిబాట పట్టాడు. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో మూడో సీడ్‌ తన్వీ 21-16, 21-15తో యువాన్‌ అన్‌ కి (చైనా)ను ఓడించింది. మిగతా భారత అమ్మాయిల్లో ఇషారాని బారువా 21-18, 15-21, 21-7తో లి సో యు (కొరియా)పై, రక్షిత 22-24, 21-12, 21-13తో యూ ఎ యువాన్‌ (కొరియా)పై, అన్‌మోల్‌ కర్బ్‌ 16-21, 21-17, 21-12తో లొ సి యన్‌ (హాంకాంగ్‌)పై, శ్రియాన్షి 21-15, 21-14తో యు పొ (చైనీస్‌ తైపీ)పై, అస్మిత 22-20, 21-18తో రికో హిరమోటో (జపాన్‌)పై గెలిచి రెండో రౌండ్‌ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్‌ శ్రీకాంత్‌ 20-22, 21-14, 12-21తో డేనియల్‌ డుబోవెంటో (ఇజ్రాయెల్‌) చేతిలో, తరుణ్‌ 13-21, 21-12, 19-21తో యూ టె బిన్‌ (కొరియా) చేతిలో, కిరణ్‌ జార్జ్‌ 15-21, 9-21తో పార్క్‌ సంగ్‌ యోంగ్‌ (కొరియా) చేతిలో పరాజయం పాలయ్యారు. డబుల్స్‌లో కృష్ణ ప్రసాద్‌-పృథ్వీ రాజ్‌ జోడీ 21-16, 21-18తో థాయ్‌లాండ్‌ జంట వర్రా పోల్‌-చెరోన్‌కిటమోర్న్‌పై, సోనాలి-రితిక ద్వయం 12-21, 21-15, 21-12తో కొరియా జోడీ బాంగ్‌ జి సన్‌-హయున్‌ జి సంగ్‌పై నెగ్గాయి. ఇక, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఇషాన్‌ భట్నాగర్‌-శ్రుతి మిశ్రా రెండో రౌండ్‌కు చేరుకొంది.

ఇవి కూడా చదవండి:

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Updated Date - Aug 06 , 2026 | 04:07 AM