Share News

క్వార్టర్స్‌లో తన్వీ, రక్షిత

ABN , Publish Date - Aug 07 , 2026 | 04:26 AM

యువ షట్లర్‌ తన్వీశర్మ జోరు కొనసాగిస్తూ కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది...

క్వార్టర్స్‌లో తన్వీ, రక్షిత

కొరియా ఓపెన్‌

అసన్‌ (కొరియా): యువ షట్లర్‌ తన్వీశర్మ జోరు కొనసాగిస్తూ కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. అలాగే రక్షిత రామరాజ్‌, అస్మిత చలిహా కూడా ముందంజ వేశారు. పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్‌ ద్వయం కూడా రౌండ్‌-8కి చేరింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ ప్రీక్వార్టర్‌ఫైనల్లో తన్వీ 21-16, 17-21, 21-13తో సహచర క్రీడాకారిణి శ్రియాన్షిపై పోరాడి నెగ్గింది. ఇక..రక్షిత 22-20, 21-10తో సుజుపై, చలిహా 21-17, 21-6తో కిమ్‌పై నెగ్గి రౌండ్‌-8లోకి ప్రవేశించారు. అన్‌మోల్‌ కర్బ్‌ 21-23, 21-15, 18-21తో ఉ థీ ట్రాంగ్‌ చేతిలో, మాన్సీ సింగ్‌ 12-21, 21-14, 17-21తో హాన్‌ చేతిలో పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమించారు. పురుషుల డబుల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో కృష్ణప్రసాద్‌/పృథ్వీ కృష్ణమూర్తి రాయ్‌ జోడీ 21-18, 21-19తో కిమ్‌/షిన్‌ జంటపై గెలుపొందింది. మహిళల డబుల్స్‌లో రుత్విక/సొనాలీ సింగ్‌ ద్వయం 15-21, 9-21తో నకాడే/టకాహషీ జోడీ చేతిలో ప్రీక్వార్టర్‌ఫైనల్లో ఓడింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో శుత్రి మిశ్రా/ఇషాన్‌ భట్నాగర్‌ జంట 16-21, 21-16, 13-21తో షిన్‌/కిమ్‌ ద్వయం చేతిలో రౌండ్‌-16లో ఓడిపోయింది.

ఇవి కూడా చదవండి:

సీనియర్ ఆటగాళ్లను గౌరవించాలి.. గంభీర్‌కు పరోక్షంగా సందేశం ఇచ్చిన రహానే

ప్రీతి జింటాతో డేటింగ్ రూమర్స్.. ఎట్టకేలకు నోరు విప్పిన బ్రెట్ లీ

Updated Date - Aug 07 , 2026 | 04:26 AM