తన్వి చేజారిన పసిడి
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:03 AM
యూత్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ తన్వి పత్రి స్వర్ణ చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయింది. ..
యూత్ ఒలింపిక్స్‌లో రజతంతో సరి
డాకర్ (సెనెగల్): యూత్ ఒలింపిక్స్‌లో భారత షట్లర్ తన్వి పత్రి స్వర్ణ చరిత్రకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ మెగా క్రీడల మహిళల బ్యాడ్మింటన్‌లో తుదిపోరుకు చేరి రికార్డు సృష్టించిన ఈ ఒడిశా అమ్మాయి.. చివరకు రజతంతో సరిపెట్టుకుంది. గురువారం హోరాహోరీగా సాగిన సింగిల్స్ ఫైనల్లో తన్వి 21-15, 13-21, 24-26తో చైనా షట్లర్ జాంగ్ యి గ్జిన్ చేతిలో పరాజయం పాలైంది. దీంతో యూత్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్‌లో రజతం నెగ్గిన తొలి భారత మహిళా షట్లర్‌గా 15 ఏళ్ల తన్వి ఘనత వహించింది. గతంలో ఈ క్రీడల బ్యాడ్మింటన్‌లో భారత్ నుంచి హెచ్‌ఎస్ ప్రణయ్ (2010), లక్ష్యసేన్ (2018) రజత పతకాలు సాధించారు.
ఈ వార్తలు కూడా చదవండి
లాస్ ఏంజెలెస్ సిటీ అటార్నీగా భారత సంతతి మహిళ..
పొత్తు లేకపోతే అన్ని స్థానాల్లో పోటీ చేస్తాము: చిరాగ్ పాశ్వాన్