Share News

T20 World Cup Controversy: ఆడితే ఆడండి.. లేదంటే అంతే

ABN , Publish Date - Jan 20 , 2026 | 05:23 AM

టీ20 ప్రపంచ కప్‌లో తమ జట్టు మ్యాచ్‌లను భారత్‌ నుంచి మార్చాల్సిందేనంటూ మొం డికేస్తున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గట్టిగా...

T20 World Cup Controversy: ఆడితే ఆడండి.. లేదంటే అంతే

బంగ్లాకు ఐసీసీ అల్టిమేటం

అయినా ఆడేది లేదంటున్న బీసీబీ

ఢాకా/దుబాయ్‌: టీ20 ప్రపంచ కప్‌లో తమ జట్టు మ్యాచ్‌లను భారత్‌ నుంచి మార్చాల్సిందేనంటూ మొం డికేస్తున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ)కు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) గట్టిగా సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో బంగ్లా నిర్ణయాన్ని మార్చుకొనేందుకు ఐసీసీ ఈనెల 21 వరకు గడువు విధించినట్టు సమాచారం. భారత్‌లో ఖరారు చేసిన వేదికలలోనే మ్యాచ్‌లు ఆడాలని బీసీబీకి ఐసీసీ అల్టిమేటమ్‌ జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆ గడువులోగా తేల్చకపోతే టోర్నీనుంచి బంగ్లాదేశ్‌ను బహిష్కరిస్తామని కూడా ఖరాఖండిగా చెప్పినట్టు ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. భారత్‌ వెళ్లేందుకు నిరాకరిస్తే..ఆ జట్టు స్థానంలో ర్యాంకింగ్స్‌ ఆధారంగా మరో జట్టును ఆడిస్తామని బీసీబీని హెచ్చరించినట్టు ఐసీసీ వర్గాలను ఉటంకించాయి.

ఆ వార్తలు నిజం కాదు: ఐసీసీ తమకు అల్టిమేటం జారీ చేసినట్టుగా వస్తున్న వార్తలను బంగ్లా బోర్డు ఖండించింది. ‘గత శనివారం ఐసీసీ ప్రతినిధి ఒకరు మా దేశం వచ్చారు. ఇంతకుముందు ఖరారు చేసిన వేదికల్లో ఆడలేమని తెలిపాం. అందువల్ల ప్రత్యామ్నాయ వేదికను నిర్ణయించాలని కోరాం. అంతేగానీ ఫలానా తేదీలోగా నిర్ణయం చెప్పాలని ఆయన అనలేదు’ అని బీసీబీ డైరెక్టర్‌ అంజాద్‌ హొసేన్‌ సోమవారం తెలిపారు. కాగా ఈ వరల్డ్‌కప్‌ వచ్చేనెల ఏడునుంచి జరుగుతుంది.

ఇవి కూడా చదవండి:

రో-కో మళ్లీ బరిలోకి దిగేదెప్పుడంటే.?

అన్నిసార్లూ భారీ స్కోర్లు చేయడం సాధ్యపడదు.. రోహిత్ ఫామ్‌పై గిల్ స్పందనిదే..

Updated Date - Jan 20 , 2026 | 05:23 AM