టాప్-10లో సూర్య ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్
ABN , Publish Date - Jan 29 , 2026 | 05:20 AM
ప్రస్తుత న్యూజిలాండ్ సిరీ్‌సతో ఫామ్‌లోకొచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. బుధవారం ప్రకటించిన...
దుబాయ్: ప్రస్తుత న్యూజిలాండ్ సిరీ్‌సతో ఫామ్‌లోకొచ్చిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ర్యాంకింగ్స్‌లోనూ దూసుకెళ్లాడు. బుధవారం ప్రకటించిన టీ20 బ్యాటర్ల జాబితాలో సూర్య ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకాడు. తద్వారా ఏడో ర్యాంక్‌తో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఇక, అభిషేక్ శర్మ నెంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, తిలక్ వర్మ మూడో స్థానంలో మార్పు లేదు. మిగతా బ్యాటర్లలో శివమ్ దూబే 58వ, ఇషాన్ కిషన్ 64వ, రింకూ సింగ్ 68వ ర్యాంకుల్లో ఉన్నారు. బౌలర్ల జాబితాలో బుమ్రా నాలుగు స్థానాలు మెరుగై 13వ, రవి బిష్ణోయ్ 13 స్థానాలు ఎగబాకి 19వ ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. వరుణ్ చక్రవర్తి టాప్ ర్యాంక్‌ను పదిలపరుచుకున్నాడు.
ఇవి కూడా చదవండి:
టీ20 ర్యాంకింగ్స్‌లో సత్తాచాటిన టీమిండియా ప్లేయర్లు
జెమీమా రోడ్రిగ్స్‌కు బిగ్ షాక్