Share News

Suresh Kalmadi Pillar of Indian Sports: భారత క్రీడారంగ దిక్సూచి

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:43 AM

కాంగ్రెస్‌ నాయకుడు, మంగళవారం కన్నుమూసిన సురేశ్‌ కల్మాడీ దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత క్రీడారంగంపై చెరగని ముద్ర వేశారు. కల్మాడీ భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా...

Suresh Kalmadi Pillar of Indian Sports: భారత క్రీడారంగ దిక్సూచి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు, మంగళవారం కన్నుమూసిన సురేశ్‌ కల్మాడీ దాదాపు రెండు దశాబ్దాలపాటు భారత క్రీడారంగంపై చెరగని ముద్ర వేశారు. కల్మాడీ భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడిగా 1996 నుంచి 2011 వరకు సుదీర్ఘకాలం సేవలందించారు. అంతేకాకుండా ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నో అంతర్జాతీయ ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యమివ్వగలిగింది. 1989, 2013 ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌ప్స, 2003 ఆఫ్రో-ఆసియన్‌ గేమ్స్‌, 2008 కామన్వెల్త్‌ యూత్‌ గేమ్స్‌, 2010 కామన్వెల్త్‌ గేమ్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. అయితే కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు రావడం ఆయన జీవితంతో మాయని మచ్చగా చెప్పవచ్చు. దీంతో దేశవ్యాప్తంగా కల్మాడీపై విమర్శలు పెరిగాయి. ఇదే కారణంగా అరెస్ట్‌ కావడంతో అతను 2011లో ఐఓఏ చీఫ్‌ పదవి నుంచి వైదొలిగారు. కానీ గతేడాది ఏప్రిల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తుది నివేదికలో కల్మాడీకి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. అటు క్రీడా పరిపాలకుడిగా కల్మాడీ చేసిన సేవలు మరువరానివి. జాతీయ క్రీడలను పునరుద్ధరించి వరుస విరామాల్లో దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహించారు. అంతేకాకుండా 1987 నుంచి 2006 వరకు భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) అధ్యక్షుడిగా 19 ఏళ్లపాటు విశేష సేవలందించారు.

ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 07 , 2026 | 05:43 AM