Share News

ఏర్పాట్లలో నిర్లక్ష్యం..

ABN , Publish Date - Apr 06 , 2026 | 02:18 AM

బీసీసీఐ నిర్వహించే టీమిండియా మ్యాచ్‌లకు విక్రయించే టిక్కెట్ల కంటే రెట్టింపు ధరలకు ఐపీఎల్‌ టిక్కెట్లను అమ్ముతున్న సన్‌రైజర్స్‌ యాజమాన్యం కనీస ఏర్పాట్లు...

ఏర్పాట్లలో నిర్లక్ష్యం..

బీసీసీఐ నిర్వహించే టీమిండియా మ్యాచ్‌లకు విక్రయించే టిక్కెట్ల కంటే రెట్టింపు ధరలకు ఐపీఎల్‌ టిక్కెట్లను అమ్ముతున్న సన్‌రైజర్స్‌ యాజమాన్యం కనీస ఏర్పాట్లు చేయడంలో మాత్రం తీవ్రమైన నిర్లక్ష్యం చూపిస్తోందని ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. రూ.10 కోట్లతో స్టేడియాన్ని ఆధునీకరించామని సోషల్‌ మీడియాలో వీడియోలు పెట్టి మరీ ప్రచారం చేసుకుంటున్న సన్‌రైజర్స్‌ కనీసం కుర్చీలను కూడా శుభ్రం చేయకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్‌ బాక్సులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని చెబుతున్న సన్‌రైజర్స్‌ సాధారణ ఫ్యాన్స్‌ కూర్చొనే గ్యాలరీల్లోని కుర్చీలను శుభ్రం చేయరా? అని ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేక తమ హ్యాండ్‌ కర్చీ్‌ఫలతోనే కుర్చీలను శుభ్రం చేసుకొని మ్యాచ్‌ను వీక్షించారు.

ఇవి కూడా చదవండి:

లఖ్‌నవూ బోణీ.. హైదరాబాద్‌పై ఘన విజయం

చరిత్ర సృష్టించిన రవి బిష్ణోయ్

Updated Date - Apr 06 , 2026 | 02:18 AM