విజేత సన్‌రైజర్స్
ABN , Publish Date - Jan 27 , 2026 | 06:06 AM
సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ (ఎస్‌ఈపీ) మూడోసారి టైటిల్ నెగ్గింది.. ఆదివారం ప్రిటోరియా క్యాపిటల్స్ (పీసీ)తో ఫైనల్లో రైజర్స్ 6 వికెట్లతో నెగ్గి...
సౌతాఫ్రికా 20 లీగ్
కేప్‌టౌన్: సౌతాఫ్రికా20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్ట్రన్ కేప్ (ఎస్‌ఈపీ) మూడోసారి టైటిల్ నెగ్గింది.. ఆదివారం ప్రిటోరియా క్యాపిటల్స్ (పీసీ)తో ఫైనల్లో రైజర్స్ 6 వికెట్లతో నెగ్గి టైటిల్ అందుకుంది. 2022-23లో ఆరంభమైన ఈ లీగ్‌లో సన్‌రైజర్స్ మొత్తం నాలుగుసార్లూ ఫైనల్‌కు చేరింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా 158/7 స్కోరు సాధించింది. బ్రెవిస్ (101) శతకం సాధించాడు. ఛేదనలో సన్‌రైజర్స్ 48/4 స్కో రుతో ఓటమి దిశగా వెళ్లినా బ్రీట్‌స్కే (68 నాటౌట్), కెప్టెన్ స్టబ్స్ (63 నాటౌట్) పోరాటంతో ఆదుకున్నారు. దీంతో 19.2 ఓవర్లలో 162/4 స్కోరుతో గెలిచి చాంపియన్‌గా నిలిచింది.
ఇవి కూడా చదవండి:
మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్
అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ