స్విమ్మర్ మెకింటోష్ ప్రపంచ రికార్డు
ABN , Publish Date - Jul 07 , 2026 | 03:21 AM
మహిళల స్విమ్మింగ్‌లో 17 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రపంచ రికార్డును కెనడా స్టార్, ఒలింపిక్ చాంపియన్ సమ్మర్ మెకింటోష్ తిరగ రాసింది...
మాంట్రియల్: మహిళల స్విమ్మింగ్‌లో 17 ఏళ్లుగా కొనసాగుతున్న ప్రపంచ రికార్డును కెనడా స్టార్, ఒలింపిక్ చాంపియన్ సమ్మర్ మెకింటోష్ తిరగ రాసింది. కెనడా స్విమ్మింగ్ ట్రయల్స్‌లో భాగంగా జరిగిన 200 మీ. బట్టర్‌ఫ్లై ఈవెంట్‌ను 19 ఏళ్ల మెకింటోష్ 2 నిమిషాల 1.65 సెకన్లలో పూర్తి చేసింది. తద్వారా 2009లో లియు జిగే (చైనా) నెలకొల్పిన 2 నిమిషాల 01.81 సెకన్ల రికార్డును మెకింటోష్ అధిగమించింది.
ఇవి కూడా చదవండి:
వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ
ట్రంప్ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు