Share News

శిథిలమైన వాటిని కూల్చేయండి

ABN , Publish Date - Apr 07 , 2026 | 02:41 AM

క్రీడా ప్రాంగణాల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సూచించింది....

శిథిలమైన వాటిని కూల్చేయండి

ప్రమాదాల నివారణకు క్రీడా మంత్రిత్వశాఖ సూచనలు

న్యూఢిల్లీ: క్రీడా ప్రాంగణాల్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సూచించింది. మూడు నెలల క్రితం హరియాణాలో బాస్కెట్‌బాల్‌ కోర్టులో తుప్పుపట్టిన స్తంభం పడి జాతీయ క్రీడాకారుడు మృతి చెందగా.. తాజాగా మహారాష్ట్రలో ఓ కాలేజీలో ఇలాంటి తరహా సంఘటనలోనే ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ నేపథ్యంలోనే క్రీడాశాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. మరమ్మతులకు గురైన పరికరాలు, క్రీడా సామగ్రిని తక్షణంబాగుచేయాలని చెప్పింది. ఒకవేళ రిపేర్‌ చేయలేని పరిస్థితి ఉంటే వాటిని కూల్చివేయాలని పేర్కొంది. క్రీడా ప్రాంగణాల్లోని గోల్‌ పోస్టులు, నిర్మాణాలు, గోడలు, రెయిలింగ్‌లు, ప్రేక్షకులు కూర్చునే స్టాండ్లు, విద్యుత్‌ స్తంభాలు, టవర్లు, స్కోరుబోర్డులు, డ్రెయినేజీలు, మ్యాన్‌హోల్స్‌ ఇలాంటి వాటిని తక్షణం సమీక్షించి చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఇవి కూడా చదవండి:

అందుకే ఐపీఎల్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించా.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

ధోనికి ఫిట్‌నెస్ టెస్ట్.. ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్‌తో బరిలోకి దిగనున్న తలా!

Updated Date - Apr 07 , 2026 | 02:41 AM