Share News

ఆఖర్లో మైకేల్‌ గోల్‌తో..

ABN , Publish Date - Jul 12 , 2026 | 03:26 AM

ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా.. ప్రత్యర్థి జట్లకు గోల్స్‌ కూడా ఇవ్వకుండా దూసుకెళుతున్న స్పెయిన్‌ క్వార్టర్స్‌లో మాత్రం చెమటోడ్చింది...

ఆఖర్లో మైకేల్‌ గోల్‌తో..

సెమీస్‌కు స్పెయిన్‌

  • బెల్జియంపై 2-1తో విజయం

లాస్‌ఏంజిల్స్‌: ఒక్క మ్యాచ్‌ కూడా ఓడకుండా.. ప్రత్యర్థి జట్లకు గోల్స్‌ కూడా ఇవ్వకుండా దూసుకెళుతున్న స్పెయిన్‌ క్వార్టర్స్‌లో మాత్రం చెమటోడ్చింది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచకప్‌ పోరులో బెల్జియం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకాగా.. సబ్‌స్టిట్యూట్‌ మైకేల్‌ మెరినో 88వ నిమిషంలో చేసిన గోల్‌తో ఊపిరిపీల్చుకుంది. దీంతో 2-1 స్కోరుతో గట్టెక్కిన స్పెయిన్‌ 2010 తర్వాత సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఈ జట్టుకిది వరుసగా 36వ మ్యాచ్‌ విజయం కావడం విశేషం. మంగళవారం అర్ధరాత్రి జరిగే తొలి సెమీ్‌సలో ఫేవరెట్‌ ఫ్రాన్స్‌తో స్పెయిన్‌ తలపడనుంది. స్పెయిన్‌ తరపున మరో గోల్‌ను ఫాబియాన్‌ రుయిజ్‌ (30) సాధించగా, బెల్జియంకు చార్లెస్‌ డి కెటెలేర్‌ (41) అందించాడు.

హోరాహోరీ: టోర్నీ ఆద్యంతం ఆధిపత్యం చూపిన స్పెయిన్‌కు క్వార్టర్స్‌లో అసలైన సవాల్‌ ఎదురైంది. ప్రథమార్ధం 30వ నిమిషంలో రుయిజ్‌ రీబౌండ్‌ షాట్‌ను గోల్‌గా మల్చడంతో స్పెయిన్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. కానీ ఈ సంతోషం ఎక్కువసేపు లేకుండా బెల్జియం షాకిచ్చింది. 41వ నిమిషంలోనే తిమోతి అందించిన క్రాస్‌ను ఫార్వర్డ్‌ ప్లేయర్‌ చార్లెస్‌ హెడర్‌ గోల్‌తో స్కోరును సమం చేశాడు. ఇక సెకండాఫ్‌ 86వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన మెరినో వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆపద్భాందవుడయ్యాడు. పోర్చుగల్‌పై చేసిన లేట్‌ గోల్‌ను ఇక్కడా పునరావృతం చేశాడు. కుబర్సి కొట్టిన బంతిని బెల్జియం గోల్‌కీపర్‌ లామెన్స్‌ సరిగ్గా పట్టుకోలేకపోయాడు. దీంతో బయటికి వచ్చిన బంతిని 88వ నిమిషంలో మెరినో గోల్‌పో్‌స్టలోకి పంపి స్పెయిన్‌ను సంబరాల్లో ముంచెత్తాడు.

ఇవీ చదవండి:

స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్‌ చిట్!

ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్

Updated Date - Jul 12 , 2026 | 03:26 AM