వారెవ్వా.. కొరియా
ABN , Publish Date - Jun 13 , 2026 | 01:47 AM
మెక్సికో: ఫిఫా ప్రపంచక్‌పలో ఆసియా జట్టు దక్షిణ కొరియా అదరగొట్టింది. శుక్రవారం ఉదయం జరిగిన మెగా టోర్నీ రెండో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను చిత్తుచేసింది. గ్రూప్-ఎలో భాగంగా సాగిన...
నేటి మ్యాచ్‌లు
అమెరికా X పరాగ్వే
(శనివారం ఉదయం 6.30)
కతార్ X స్విట్జర్లాండ్
(శనివారం అర్ధరాత్రి 12.30)
బ్రెజిల్ X మొరాకో
(ఆదివారం తెల్లవారుజాము 3.30)
చెక్ రిపబ్లిక్‌పై 2-1తో విజయం
మెక్సికో శుభారంభం
ఫిఫా ప్రపంచకప్
మెక్సికో: ఫిఫా ప్రపంచక్‌పలో ఆసియా జట్టు దక్షిణ కొరియా అదరగొట్టింది. శుక్రవారం ఉదయం జరిగిన మెగా టోర్నీ రెండో మ్యాచ్‌లో చెక్ రిపబ్లిక్‌ను చిత్తుచేసింది. గ్రూప్-ఎలో భాగంగా సాగిన ఈ ఉత్కంఠభరిత పోరులో కొరియా 2-1తో ప్రత్యర్థికి ‘చెక్’ పెట్టింది. కొరియా ఆటగాళ్లలో వాంగ్ ఇన్ బోయెమ్ (67వ నిమిషంలో), ఓ హ్యూన్ గ్యూన్ (80వ) చెరో గోల్ కొట్టారు. చెక్ తరఫున ఏకైక గోల్‌ను లాడిస్లావ్ (59వ) చేశాడు.
మెక్సికో.. అదరహో
అంతకుముందు గ్రూప్-ఎలోనే జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో ఆతిథ్య మెక్సికో బోణీ కొట్టింది. సొంతగడ్డపై అద్భుత ఆటతీరును ప్రదర్శిస్తూ 2-0తో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. మ్యాచ్‌లో నమోదైన రెండు గోల్స్‌ను జులియన్ క్వినోన్స్ (9వ నిమిషంలో), రావుల్ జిమెనెజ్ (67వ) చేశారు.
ఒకే పోరు.. మూడు రెడ్ కార్డులు ఈ ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకుంది. మెక్సికో, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈ పోరులో ఏకంగా మూడు రెడ్‌కార్డ్‌లను రెఫరీ సాంపియో జారీ చేయడం చర్చనీయాంశమైంది. హద్దులు మీరి ప్రవర్తించనందుకుగాను ఇద్దరు సఫారీ ఆటగాళ్లు సిథోల్, థెంబా జ్వానెతో పాటు మెక్సికో ఆటగాడు సీజర్ మాంటెస్‌లకు రెఫరీ రెడ్‌కార్డ్‌లు చూపించాడు. ఫిఫా కప్ చరిత్రలో ఒక మ్యాచ్‌లో ఇన్ని రెడ్‌కార్డ్‌లు చూపించడం ఇదే తొలిసారి.
ఈ వార్తలు కూడా చదవండి..
హరీశ్ రావు ఆరోపణలు.. స్పందించిన మంత్రులు
రిజర్వేషన్లపై కేంద్రానికి సమర్పించనున్న జస్టిస్ బాలకృష్ణన్ నివేదిక.. సర్వత్ర ఉత్కంఠ
Read Latest TG News And Telugu News