బీసీసీఐ నిర్ణయం సరైనదే
ABN , Publish Date - Apr 01 , 2026 | 01:17 AM
భారత్‌లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేదికల్లో ఈడెన్ గార్డెన్స్ లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సమర్థించాడు...
టెస్టు వేదికలపై గంగూలీ
కోల్‌కతా: భారత్‌లో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వేదికల్లో ఈడెన్ గార్డెన్స్ లేకపోవడాన్ని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సమర్థించాడు. వచ్చే జనవరి 21 నుంచి ఫిబ్రవరి 25 వరకు నాగ్‌పూర్, చెన్నై, గువాహటి, రాంచీ, అహ్మదాబాద్ వేదికలుగా ఈ సిరీస్ జరుగుతుంది. అయితే ఇందులో ముంబై, కోల్‌కతా లేకపోవడంపై పలువురు మాజీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఈడెన్‌లో టెస్టు జరిగితే సంతోషమే. కానీ ఈ సుదీర్ఘ ఫార్మాట్‌ను సంప్రదాయ వేదికల్లోనే నిర్వహించడం సరికాదు. దేశంలోని వివిధ వేదికల్లో ఆడించడాన్ని కూడా స్వాగతించాల్సిందే’ అని దాదా అన్నాడు. మరోవైపు ఈడెన్‌లో ఆస్ట్రేలియాపై 2001లో గెలిచిన టెస్టు సభ్యులంతా త్వరలోనే కలుసుకోబోతున్నట్టు గంగూలీ చెప్పాడు.
ఇవి కూడా చదవండి..
ఎల్డీఎఫ్ గెలుపును కోరుకుంటున్న మోదీ.. విమర్శలు గుప్పించిన రాహుల్
బీజేపీ అనాగరిక పార్టీ.. నిప్పులు చెరిగిన మమత