Share News

బ్రాడ్‌మన్‌ క్యాప్‌నకు రికార్డు ధర

ABN , Publish Date - Jan 27 , 2026 | 06:15 AM

ఆస్ట్రేలియా లెజెండ్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ధరించిన క్యాప్‌ వేలంలో భారీ ధర పలికింది. ‘ఆస్ర్టేలియా డే’ సందర్భంగా సోమవారం గోల్డ్‌కో్‌స్టలో జరిగిన వేలంలో...

బ్రాడ్‌మన్‌ క్యాప్‌నకు రికార్డు ధర

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా లెజెండ్‌ సర్‌ డాన్‌ బ్రాడ్‌మన్‌ ధరించిన క్యాప్‌ వేలంలో భారీ ధర పలికింది. ‘ఆస్ర్టేలియా డే’ సందర్భంగా సోమవారం గోల్డ్‌కో్‌స్టలో జరిగిన వేలంలో రూ. 2.90 కోట్లకు (4,60,000 ఆస్ర్టేలియా డాలర్లు) ఈ క్యాప్‌ అమ్ముడైంది. ఈ క్రమంలో వేలం వేసిన బ్రాడ్‌మన్‌ క్యాప్‌ల్లో ఇదే అత్యధిక ధర. 1947-48లో భారత్‌తో ఆసీస్‌ గడ్డపై జరిగిన సిరీ్‌సలో ధరించిన ఈ క్యాప్‌ను టీమిండియా ఆల్‌రౌండర్‌ శ్రీరంగ వాసుదేవ్‌ సొహోనికి బ్రాడ్‌మన్‌ బహూకరించాడు. సొహోనీ కుటుంబం వద్దే 75 ఏళ్లపాటు ఈ క్యాప్‌ ఉంది. అయితే, సొహోనీ ఆఖరికోరిక మేరకు దీన్ని మళ్లీ ఆస్ట్రేలియా చేర్చినట్టు వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ టోపీని తయారుచేసిన సిడ్నీకి చెందిన ఫార్మర్స్‌ అనే సంస్థ 1970 తర్వాత క్యాప్‌ల తయారీని నిలిపివేసింది. కాగా ఈ సిరీస్‌ ఆస్ర్టేలియా గడ్డపై బ్రాడ్‌మన్‌కు ఆఖరిది. సిరీ్‌సలోని ఐదు టెస్టుల్లో డాన్‌ నాలుగు శతకాలతో మొత్తం 715 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి:

మా వాళ్లతో జాగ్రత్త.. పాక్‌కు టీమిండియా మాజీ క్రికెటర్ వార్నింగ్

అరుదైన చెత్త రికార్డుతో కోహ్లీ సరసన చేరిన సంజూ

Updated Date - Jan 27 , 2026 | 06:15 AM