Share News

క్వార్టర్స్‌లో సింధు, లక్ష్య

ABN , Publish Date - May 15 , 2026 | 01:57 AM

ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ తోపాటు సాత్విక్‌ జోడీ థాయ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా.. కిడాంబి శ్రీకాంత్‌ ఇంటిదారి పట్టాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ సింధు...

క్వార్టర్స్‌లో సింధు, లక్ష్య

  • సాత్విక్‌ జోడీ కూడా..

  • శ్రీకాంత్‌ అవుట్‌

బ్యాంకాక్‌: ఏస్‌ షట్లర్లు పీవీ సింధు, లక్ష్యసేన్‌ తోపాటు సాత్విక్‌ జోడీ థాయ్‌ ఓపెన్‌ క్వార్టర్స్‌కు చేరుకోగా.. కిడాంబి శ్రీకాంత్‌ ఇంటిదారి పట్టాడు. గురువారం జరిగిన రెండో రౌండ్‌లో ఆరో సీడ్‌ సింధు 21-13, 21-15తో అమలి షుల్జ్‌ (డెన్మార్క్‌)పై గెలిచింది. అయితే, దేవిక సిహాగ్‌ 21-23, 11-21తో ఒపట్నీపుత్‌ (థాయ్‌) చేతిలో, మాళవిక 12-21, 7-21తో చెన్‌ చేతిలో, శ్రీకాంత్‌ 16-21, 21-11, 8-21తో సు లి యంగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడారు. ఏడో సీడ్‌ లక్ష్య సేన్‌ 21-12, 21-13తో జు జువాన్‌ చెన్‌ (చైనా)పై విజయం సాధించాడు. ఇక, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌-చిరాగ్‌ శెట్టి జంట 21-12, 21-19తో మలేసియాకు చెందిన జెర్మీ గూంటింగ్‌-మహ్మద్‌ హైకాల్‌పై గెలిచింది.

వార్తలు కూడా చదవండి

ఐపీఎల్ 2026: టాస్ నెగ్గిన ముంబై ఇండియన్స్

శ్రీలంక టూర్.. భారత- ఏ జట్టు కెప్టెన్‌గా తిలక్ వర్మ

Updated Date - May 15 , 2026 | 01:57 AM