India T20 Squad Update: టీ20 జట్టులో శ్రేయాస్, బిష్ణోయ్
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:54 AM
న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి వన్డే సిరీ్‌సకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈనెల...
సిరీస్ నుంచి సుందర్ అవుట్
ముంబై: న్యూజిలాండ్‌తో తొలి మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడి వన్డే సిరీ్‌సకు దూరమైన ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్.. ఈనెల 21 నుంచి కివీ్‌సతో జరిగే ఐదు టీ20ల సిరీ్‌సలోనూ ఆడడం లేదు. సుందర్ స్థానంలో లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే, పక్కటెముకల నొప్పితో బాధపడుతున్న తిలక్ వర్మ స్థానంలో తొలి మూడు టీ20ల కోసం స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను కూడా జట్టులోకి చేర్చినట్టు బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్