శీతల్‌కు కారు బహుమతి
ABN , Publish Date - Nov 26 , 2026 | 03:07 AM
ఆసియా పారా క్రీడల పతక విజేత, పారా ఆర్చర్ షీతల్ దేవికి హ్యుం డయ్ సంస్థ కారును బహూకరించింది...
గుర్‌గావ్: ఆసియా పారా క్రీడల పతక విజేత, పారా ఆర్చర్ షీతల్ దేవికి హ్యుం డయ్ సంస్థ కారును బహూకరించింది. ఆసియా పారా క్రీడల్లో శీతల్ కనబర్చిన ప్రతిభకుగానూ బేయాన్ కారును ప్రదానం చేసినట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. 19 ఏళ్ల శీతల్ గత నెలలో జరిగిన ఆసియా పారా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్‌డ్ విభాగాల్లో పతకాలు సాధించడం విదితమే. ఈ సంస్థకు శీతల్ ప్రచారకర్తగా కూడా వ్యవహరిస్తోంది. ఇక, గతంలో మహీంద్ర సంస్థ ఆమెకు స్కార్పియో కారును బహూకరించడం తెలిసిందే.
ఇవి కూడా చదవండి:
వైభవ్ వన్డేల్లో ట్రిపుల్ సెంచరీ కూడా బాదేస్తాడు: చిన్ననాటి కోచ్ మనీశ్ ఓజా
ఐపీఎల్ 2027: వేలంలోకి వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్