Share News

సెరెనా..పోరాడినా

ABN , Publish Date - Jul 02 , 2026 | 05:29 AM

నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు తొలిరౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పొందిన...

సెరెనా..పోరాడినా

మూడు సెట్ల పోరులో పరాజయం

సబలెంక, సిన్నర్‌ ముందంజఫఆండ్రీవా అవుట్‌

లండన్‌: నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బరిలోకి దిగిన దిగ్గజ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్‌కు తొలిరౌండ్‌లోనే పరాజయం ఎదురైంది. ప్రతిష్ఠాత్మక వింబుల్డన్‌లో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ పొందిన 23 సింగిల్స్‌ గ్రాండ్‌స్లామ్‌ల చాంపియన్‌, 44 ఏళ్ల సెరెనా మూడు సెట్లపాటు ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టింది. మంగళవారం రాత్రి జరిగిన సింగిల్స్‌ తొలి రౌండ్‌లో 3-6, 7-6 (6), 3-6తో ఆస్ట్రేలియాకు చెందిన 20 ఏళ్ల మయా జాయింట్‌ చేతిలో ఓటమితో అభిమానుల హర్షధ్వానాల మధ్య వెనుదిరిగింది. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ చాంపియన్‌, 5వ సీడ్‌ మిర్రా ఆండ్రీవా 6-4, 5-7, 4-6తో 2024 వింబుల్డన్‌ విజేత క్రెజికోవా చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌ నెం.1 సబలెంక బుధవారం జరిగిన రెండో రౌండ్‌లో 6-1, 7-6 (9) కెస్లర్‌ను చిత్తు చేసి ముందంజ వేసింది. ఇతర మ్యాచ్‌ల్లో పెగుల 7-6 (6), 6-1తో సోరిబ్స్‌పై, గాఫ్‌ 6-3, 3-6, 7-6 (7)తో సియారాపై, ముచోవా 6-3, 6-2తో జాంగ్‌పై, ఒసాకా 6-3, 6-2తో గసనోవాపై నెగ్గి మూడో రౌండ్‌లో అడుగుపెట్టారు. పురుషుల సింగిల్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌ సిన్నర్‌ 7-6 (4), 7-6 (2), 6-4తో బోర్గె్‌సని, మెద్వెదెవ్‌ 3-6, 6-3, 7-5, 6-2తో మెరిడా గులిర్‌ని చిత్తుచేసి మూడో రౌండ్‌కు చేరారు.

ఇవి కూడా చదవండి:

ట్రేడ్ హీట్.. హార్దిక్ పాండ్య కోసం ఏడు ఫ్రాంచైజీలు పోటీ!

శ్రీశాంత్‌పై నిషేధం ఎత్తివేసిన కేరళ క్రికెట్ అసోసియేషన్

Updated Date - Jul 02 , 2026 | 05:29 AM