Vijay Hazare Trophy Final: ‘విజయ్ హజారే’ ఫైనల్లో సౌరాష్ట్ఠ్రవిదర్భ
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:58 AM
సౌరాష్ట్ర, విదర్భ జట్లు విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్లతో పంజాబ్‌పై గెలిచింది. మొదట పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో...
బెంగళూరు: సౌరాష్ట్ర, విదర్భ జట్లు విజయ్ హజారే ట్రోఫీలో ఫైనల్‌కు దూసుకెళ్లాయి. శుక్రవారం జరిగిన రెండో సెమీఫైనల్లో సౌరాష్ట్ర 9 వికెట్లతో పంజాబ్‌పై గెలిచింది. మొదట పంజాబ్ నిర్ణీత 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. అన్మోల్‌ప్రీత్ (100) శతకంతో, కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ (87) అర్ధ సెంచరీతో రాణించారు. విదర్భ బౌలర్లలో చేతన్ సకారియా 4, అంకుర్, చిరాగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఓపెనర్ విశ్వరాజ్ జడేజా (127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్లతో 165 నాటౌట్) సూపర్ సెంచరీతో విజృంభించడంతో సౌరాష్ట్ర 39.3 ఓవర్లలో 293/1 స్కోరు చేసి గెలిచింది. మరో ఓపెనర్, కెప్టెన్ హార్విక్ దేశాయ్ (64), ప్రేరక్ మన్కడ్ (52 నాటౌట్) అర్ధ శతకాలతో సత్తా చాటారు. గురువారం జరిగిన తొలి సెమీ్‌సలో విదర్భ 6 వికెట్లతో కర్ణాటకను ఓడించింది. తొలుత కర్ణాటక 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (76), కృష్ణన్ శ్రీజిత్ (54) అర్ధ సెంచరీలు చేశారు. విదర్భ బౌలర్లలో దర్శన్ నల్కండే (5/48) ఐదు వికెట్లతో విజృంభించాడు. ఛేదనలో అమన్ (138) సెంచరీకి తోడు రవికుమార్ (76 నాటౌట్) అజేయ అర్ధ శతకంతో విదర్భ 46.2 ఓవర్లలోనే 284/4 స్కోరు చేసి గెలిచింది. ఆదివారం ఫైనల్ జరగనుంది.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్