Share News

నా పిల్లలను బ్యాడ్మింటన్‌ ఆడించను

ABN , Publish Date - May 07 , 2026 | 04:29 AM

తకాలు సాధించినప్పుడు కూడా క్రీడాకారులకు గుర్తింపు లేకపోతే ఎలా.. అని భారత స్టార్‌ డబుల్స్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (25) తీవ్ర ఆవేదన వ్యక్తంజేశాడు...

నా పిల్లలను బ్యాడ్మింటన్‌ ఆడించను

నా పిల్లలను బ్యాడ్మింటన్‌ ఆడించను

మాకేదీ గుర్తింపు ?

స్టార్‌ షట్లర్‌ సాత్విక్‌ ఆవేదన

న్యూఢిల్లీ: పతకాలు సాధించినప్పుడు కూడా క్రీడాకారులకు గుర్తింపు లేకపోతే ఎలా.. అని భారత స్టార్‌ డబుల్స్‌ షట్లర్‌ సాత్విక్‌ సాయిరాజ్‌ (25) తీవ్ర ఆవేదన వ్యక్తంజేశాడు. గుర్తింపులేని బ్యాడ్మిం టన్‌ క్రీడలో తన పిల్లలను ఆడించబోనని అన్నాడు. డెన్మార్క్‌లో ముగిసిన థామస్‌ కప్‌ ఫైనల్స్‌లో కాంస్యం నెగ్గిన తమకు స్వాగతం పలికేందుకు ఒక్కరంటే ఒక్క అభిమాని కూడా ఎయిర్‌పోర్ట్‌కు రాకపోవడంపై సాత్విక్‌ వేదన చెందాడు. ‘జర్మనీ నుంచి ఏడు గంటలు ప్రయాణించి హైదరాబాద్‌ చేరుకున్నాం. అంతకుముందు జర్మనీ విమానాశ్రయంలో మమ్మల్ని ఒక్కరూ గుర్తు పట్టలేదు. మేం థామస్‌ కప్‌ జెర్సీలు వేసుకొని ఉన్నాం. మీరు ఎవరు? మీ మెడలో ఆ పతకాలు ఏమిటని అడిగిన పాపాన పోలేదు. ఎయిర్‌పోర్టులో ఎందరో భారతీయులున్నా ఎవరూ అడగలేదు. అంతా ఐపీఎల్‌, ఎన్నికల గురించే మాట్లాడుకుంటూ కనిపించారు. ప్రణయ్‌, శ్రీకాంత్‌, ధ్రువ్‌ కపిల ఎయిర్‌పోర్టు నుంచి ఎవరికి వారు క్యాబ్‌ బుక్‌ చేసుకొని వెళ్లిపోయారు. ఈ క్రీడకు ఎలాంటి గుర్తింపూ లేదు. అందువల్ల నా పిల్లలను ఈ ఆట కెరీర్‌గా ఎంచుకొనేందుకు అంగీకరించన’ని సాత్విక్‌ వాపోయాడు.

ఇవి కూడా చదవండి:

సంజు శాంసన్ మా జట్టుకు వెన్నుముక: రుతురాజ్

భారత టీ20 జట్టులో వైభవ్ సూర్యవంశీకి అవకాశం!

Updated Date - May 07 , 2026 | 04:29 AM