Share News

సెమీ్‌సలో సాత్విక్‌ ద్వయం

ABN , Publish Date - May 16 , 2026 | 02:46 AM

భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే,,,

సెమీ్‌సలో సాత్విక్‌ ద్వయం

సింధు, లక్ష్య అవుట్‌

థాయ్‌లాండ్‌ ఓపెన్‌

బ్యాంకాక్‌: భారత స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ఏస్‌ షట్లర్‌ పీవీ సింధు, లక్ష్యసేన్‌కు క్వార్టర్‌ఫైనల్లో ఓటమి ఎదురైంది. శుక్రవారం జరిగిన డబుల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ షెట్టి జంట 21-12, 21-13తో జపాన్‌ జోడీ నోమురా/షిమోగామిపై విజయం సాధించింది. మహిళల సింగిల్స్‌ రౌండ్‌-8 పోరులో ఆరో సీడ్‌ సింధు ఒక గేమ్‌ ఆధిక్యంలో ఉండీ..21-19, 18-21, 15-21తో టాప్‌సీడ్‌ యమగూచి (జపాన్‌) చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్‌ 21-19, 21-16తో వితిద్‌శర్న్‌ (థాయ్‌లాండ్‌) చేతిలో పరాజయం చవిచూశాడు.

ఇవి కూడా చదవండి:

ప్లే ఆఫ్స్‌కు ముందు కేకేఆర్‌కు షాక్.. ఐపీఎల్‌ను వీడిన రచిన్ రవీంద్ర

కెప్టెన్‌గా సంజు టీమిండియాను ఉత్తమంగా నడిపించగలడు: రవి శాస్త్రి

Updated Date - May 16 , 2026 | 02:47 AM