సాత్విక్ జోడీ శుభారంభం
ABN , Publish Date - May 13 , 2026 | 01:52 AM
థాయ్‌లాండ్ ఓపెన్‌లో టాప్ సీడ్ సాత్విక్ జోడీ కష్టంగా ముందంజ వేసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట...
థాయ్ ఓపెన్ బ్యాడ్మింటన్
బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్‌లో టాప్ సీడ్ సాత్విక్ జోడీ కష్టంగా ముందంజ వేసింది. మంగళవారం హోరాహోరీగా సాగిన పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట 21-19, 21-23, 21-10తో ఇండోనేసియాకు చెందిన ముహ్ పుత్ర ఇర్వియాన్‌స్యా-బగ్‌స మౌలానాపై గెలిచింది. 64 నిమిషాలపాటు సాగిన పోరులో సాత్విక్ ద్వయం తొలి గేమ్‌ను కష్టంగా చేజిక్కించుకొన్నా.. రెండో గేమ్‌లో పట్టువీడకుండా పోరాడిన ఇండోనేసియా జోడీ 1-1తో సమం చేసింది. అయితే, నిర్ణాయక మూడో గేమ్‌లో సాత్విక్ జంట దూకుడు ముందు ప్రత్యర్థులు నిలవలేకపోయారు.
ఇవి కూడా చదవండి:
నేను స్వయంగా రిటైర్ అవ్వాలనేదే వారి కోరిక: వినేశ్ ఫొగాట్
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్‌కు భారీ జరిమానా