Vijay Hazare Trophy 2025: సర్ఫరాజ్ ‘డబుల్’ మిస్
ABN , Publish Date - Jan 01 , 2026 | 06:49 AM
ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ దేశవాళీ పోటీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీతో చెలరేగాడు. అయితే త్రుటిలో ద్విశతకాన్ని...
ముంబై 444/8 ఫ గోవా చిత్తు
విజయ్ హజారే ట్రోఫీ
జైపూర్: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఈ సీజన్ దేశవాళీ పోటీల్లో తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ మరో సెంచరీతో చెలరేగాడు. అయితే త్రుటిలో ద్విశతకాన్ని చేజార్చుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో భాగంగా గోవాతో బుధవారం జరిగిన గ్రూప్ ‘సి’ మ్యాచ్‌లో సర్ఫరాజ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. 75 బంతుల్లోనే 14 సిక్సర్లతో సర్ఫరాజ్ 157 పరుగులు చేయడంతో తొలుత ముంబై 50 ఓవర్లలో 444/8 స్కోరు సాధించింది.. సర్ఫరాజ్ సోదరుడు ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (53) సత్తా చాటారు. భారీ ఛేదనలో గోవా 50 ఓవర్లలో 357/9 స్కోరు చేసి ఓడింది. అభినవ్ తేజ్‌రాణా (100) శతక్కొట్టగా, దీప్‌రాజ్ (70), లలిత్ యాదవ్ (64) పోరాడారు.
ఇవీ చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!