Share News

సలీమాకు హాకీ పగ్గాలు

ABN , Publish Date - Mar 02 , 2026 | 04:37 AM

గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈనెల 8 నుంచి జరిగే హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ కోసం భారత మహిళల జట్టును ప్రకటించారు. 20 మందితో కూడిన ఈ బృందానికి...

సలీమాకు హాకీ పగ్గాలు

  • నుంచి వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌

హైదరాబాద్‌: గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఈనెల 8 నుంచి జరిగే హాకీ వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌ కోసం భారత మహిళల జట్టును ప్రకటించారు. 20 మందితో కూడిన ఈ బృందానికి సలీమా టెటె సారథ్యం వహించనుంది. ఇక వ్యక్తిగత కారణాలతో వెటరన్‌ గోల్‌కీపర్‌ సవితా పూనియా ఈ టోర్నీకి దూరమైంది. మార్చి 14 వరకు ఈ క్వాలిఫయర్స్‌ జరుగనుంది. ఇందులో పాల్గొనే మొత్తం 8 జట్లను రెండు పూల్స్‌గా విభజించారు. పూల్‌ ‘ఎ’లో ఇంగ్లండ్‌, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా.. పూల్‌ ‘బి’లో భారత్‌, స్కాట్లాండ్‌, ఉరుగ్వే, వేల్స్‌ ఉన్నాయి. ఆగస్టులో జరిగే హాకీ వరల్డ్‌క్‌పలో మిగిలిన మూడు బెర్త్‌ల కోసం ఈ జట్లు పోటీపడనున్నాయి.

ఇవి కూడా చదవండి

చేరుకునే దారి లేకే చేజారిన ప్రాణాలు

ఆ రాశి వారికి ఈ వారం ఆర్థికస్థితి సామాన్యం

Updated Date - Mar 02 , 2026 | 04:37 AM