పతకాల్లో టాప్‌లో నిలవాలి
ABN , Publish Date - Aug 16 , 2026 | 05:52 AM
క్రీడల్లో భారత్ బలమైన దేశంగా ఎదగాలంటే..పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన నిలవడమే ముఖ్యమని మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొంది...
ముంబై: క్రీడల్లో భారత్ బలమైన దేశంగా ఎదగాలంటే..పతకాల పట్టికలో అగ్ర దేశాల సరసన నిలవడమే ముఖ్యమని మాజీ షట్లర్ సైనా నెహ్వాల్ పేర్కొంది. పలు అంతర్జాతీయ పోటీలకు భారత్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో పతకాల పట్టికలో మన స్థానం బాగా మెరుగుపడాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. దేశ క్రీడా రంగంలో ప్రధానంగా మహిళల భాగస్వామ్యంలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపింది. శనివారం ఇక్కడ ఓ కార్యక్రమంలో సైనా మాట్లాడుతూ..దేశంలో మహిళా అథ్లెట్లు తమ శక్తిసామర్థ్యాలను గ్రహించారని, అందుకే దశాబ్దంలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి..
బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..
అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..