Share News

‘ఆల్‌ ఇంగ్లండ్‌ జూనియర్‌’ చాంపియన్‌ సాయి

ABN , Publish Date - Jul 21 , 2026 | 05:20 AM

యువ తెలుగు షట్లర్‌ సాయి నచికేత్‌ భట్రాజు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ జూనియర్‌ టైటిల్‌ నెగ్గిన భారతీయుడిగా...

‘ఆల్‌ ఇంగ్లండ్‌ జూనియర్‌’ చాంపియన్‌ సాయి

ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు

బర్మింగ్‌హామ్‌: యువ తెలుగు షట్లర్‌ సాయి నచికేత్‌ భట్రాజు ప్రతిష్ఠాత్మక ఆల్‌ ఇంగ్లండ్‌ ఓపెన్‌ జూనియర్‌ టైటిల్‌ నెగ్గిన భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. అండర్‌-19 సింగిల్స్‌ ఫైనల్లో సాయి 21-8, 21-15తో భారత్‌కే చెందిన సుహా్‌సను ఓడించి విజేతగా నిలిచాడు. హైదరాబాద్‌కు చెందిన సాయి ప్రస్తుతం చేతన్‌ ఆనంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్నాడు. అర్జున అవార్డు గ్రహీత చేతన్‌ పర్యవేక్షణలో గత నాలుగేళ్లుగా జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్న సాయికి ఇదే తొలి అంతర్జాతీయ టైటిల్‌.

ఇవి కూడా చదవండి:

యమాల్ విజయం వెనుక నానమ్మ త్యాగం.. కష్టాల నుంచి ప్రపంచ స్టార్‌గా..!

రో-కో భవిష్యత్తుపై స్పష్టత ఇవ్వండి.. బీసీసీఐకి యువరాజ్ సింగ్ సూచన

Updated Date - Jul 21 , 2026 | 05:20 AM