Share News

ఆసియాడ్‌ టెన్నిస్‌ జట్టులో సహజ

ABN , Publish Date - Jun 16 , 2026 | 02:42 AM

ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పోటీపడే భారత టెన్నిస్‌ జట్టులో తెలుగమ్మాయి సహజ యామలపల్లి చోటు దక్కించుకుంది....

ఆసియాడ్‌ టెన్నిస్‌ జట్టులో సహజ

  • రిజర్వ్‌ ఆటగాడిగా రిత్విక్‌

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పోటీపడే భారత టెన్నిస్‌ జట్టులో తెలుగమ్మాయి సహజ యామలపల్లి చోటు దక్కించుకుంది. సెప్టెంబరు 19 నుంచి జపాన్‌ వేదికగా జరిగే ఆసియాడ్‌లో తలపడే పురుషులు, మహిళల జట్లను అఖిల భారత టెన్నిస్‌ సంఘం సోమ వారం ప్రకటించింది. మహిళల సింగిల్స్‌లో సహజ, వైష్ణవి అడ్కర్‌, వైదేహి.. డబుల్స్‌లో రుతుజా, ప్రార్థనా, అంకితా రైనా బరిలో దిగనున్నారు. జీల్‌ దేశాయ్‌, శ్రుతి అహ్లావత్‌ రిజర్వ్‌ క్రీడాకారిణులుగా ఎంపికయ్యారు. పురుషుల సింగిల్స్‌ నుంచి సుమిత్‌ నగల్‌, మానస్‌ ధామ్నే, దక్షిణేశ్వర్‌ సురేశ్‌.. డబుల్స్‌ తరఫున యుకీ భాంబ్రీ, శ్రీరామ్‌ బాలాజీ, అనిరుధ్‌ చంద్రశేఖర్‌ తలపడనున్నారు. తెలుగు కురాడ్రు రిత్విక్‌ బొల్లిపల్లి, కరణ్‌ సింగ్‌, నిక్కీ పూనాచ రిజర్వ్‌ ఆటగాళ్లుగా వ్యవహరిస్తారు.

ఇవి కూడా చదవండి:

ముక్కోణపు సిరీస్: సూపర్ ఓవర్‌లో శ్రీలంక-ఎ విజయం

దోహా డైమండ్ లీగ్: కమ్‌బ్యాక్ ఇవ్వనున్న నీరజ్ చోప్రా

Updated Date - Jun 16 , 2026 | 02:42 AM