ఫైనల్లో సబలెంక రిబకినా
ABN , Publish Date - Mar 15 , 2026 | 01:51 AM
ప్రపంచ మహిళల టెన్ని్‌సలో మరోసారి అరియానా సబలెంక, ఎలెనా రిబకినా అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు ఇండియన్ వెల్స్ టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ఫైట్‌కు...
ఇండియన్‌వెల్స్: ప్రపంచ మహిళల టెన్ని్‌సలో మరోసారి అరియానా సబలెంక, ఎలెనా రిబకినా అమీతుమీకి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరు ఇండియన్ వెల్స్ టోర్నీలో సింగిల్స్ టైటిల్‌ఫైట్‌కు దూసుకెళ్లారు. సెమీఫైనల్స్‌లో వరల్డ్ నెంబర్‌వన్ సబలెంక (బెలారస్) 6-3, 6-4తో లిండా నొస్కోవా (చెక్)పై, మూడో ర్యాంకర్ రిబకినా (కజకిస్థాన్) 7-5, 6-4తో స్విటోలినా (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. గతేడాది నవంబరులో డబ్ల్యూటీఏ ఫైనల్స్‌లో, ఈ జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ తుదిపోరులో సబలెంకను ఓడించి రిబకినా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే