రిబ‘క్వీన్’
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:30 AM
మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అందుకోవాలన్న టాప్‌సీడ్ అర్యానా సబలెంక కలలు కల్లలయ్యాయి. కజకిస్థాన్‌కు చెందిన ఐదోసీడ్ ఎలెనా రిబకినా వరల్డ్ నెం.1 సబలెంకకు షాకిచ్చి మహిళల సింగిల్స్ చాంపియన్‌గా...
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ X యూపీ (రా. 7.30)
ఆస్ట్రేలియన్ ఓపెన్
విజేత ఎలెనా రిబకినా
ఫైనల్లో సబలెంకకు షాక్
చాంపియన్‌కు రూ. 25.58 కోట్లు
రన్నరప్‌నకు రూ.13.30 కోట్లు
మెల్‌బోర్న్: మూడోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ అందుకోవాలన్న టాప్‌సీడ్ అర్యానా సబలెంక కలలు కల్లలయ్యాయి. కజకిస్థాన్‌కు చెందిన ఐదోసీడ్ ఎలెనా రిబకినా వరల్డ్ నెం.1 సబలెంకకు షాకిచ్చి మహిళల సింగిల్స్ చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో 26 ఏళ్ల రిబకినా 6-4, 4-6, 6-4తో బెలారస్ భామ సబలెంకను ఓడించింది. తద్వారా తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ట్రోఫీని ముద్దాడింది. కెరీర్‌లో రిబకినాకిది రెండో గ్రాండ్‌స్లామ్. 2022లో ఎలెనా వింబుల్డన్ కిరీటాన్ని దక్కించుకుంది. కీలకమైన మూడో సెట్‌లో రిబకినా 0-3తో వెనుకంజలో నిలవడంతో.. సబలెంక విజయం ఖాయమనిపించింది. కానీ ఆత్మవిశ్వాసం కోల్పోని ఎలెనా అద్భుతంగా పుంజుకుంది. వరుసగా ఐదు గేమ్‌లు గెలిచి జయకేతనం ఎగుర వేసింది. రెండు గంటలకుపైగా సాగిన మ్యాచ్‌లో.. విన్నర్లు సంధించడంలో రిబకినా (28)పై సబలెంక (35) ఆధిపత్యం ప్రదర్శించింది. ఏస్‌లలో రిబకినా (6), సంబెలంక (5) దాదాపు సమంగా నిలిచారు. ఈ గెలు పుతో 2023 మెల్‌బోర్న్ పార్క్ తుదిపోరులో సబలెంక చేతిలో పరాజయానికి రిబకినా బదులు తీర్చుకుంది. మరోవైపు.. 27 ఏళ్ల సబలెంక ఆస్ట్రేలియన్ ఫైనల్లో ఓడడం వరుసగా ఇది రెండోసారి. గత ఏడాది టైటిల్ ఫైట్‌లో మాడిసన్ కీస్ (అమెరికా) చేతిలో ఆమె ఓడిపోయింది.
విజయం సాధించగానే గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోయింది. ముఖాన ఆ భావాలు కనిపించలేదు కానీ హృదయంలో ఎన్నో భావోద్వేగాలు చెలరేగాయి.
- ఎలెనా రిబకినా
ఇవి కూడా చదవండి:
ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్
టీ20 ప్రపంచ కప్ 2026: ఆస్ట్రేలియా జట్టు ప్రకటన.. స్టార్ ప్లేయర్లకు దక్కని చోటు