ఆ టీ-షర్ట్ అగార్కర్‌కి కౌంటరా?
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:34 AM
టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. త్వరలో ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ ఫుల్‌హౌస్’ టీవీ షోకు...
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బుల్లితెరపై సందడి చేయనున్నాడు. త్వరలో ప్రసారమయ్యే ‘ఫ్యామిలీ ఫుల్‌హౌస్’ టీవీ షోకు అతడు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో రోహిత్ ప్రచారం చేస్తున్న ఓ వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. అతడు ధరించిన టీషర్ట్‌పై ‘నాన్ కమిటల్’ అని రాసి ఉండడం అందరి దృష్టినీ ఆకర్షించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు కౌంటర్‌గా రోహిత్ ఇలా చేశాడని అభిమానులు అంటున్నారు. గతేడాది ఆస్ట్రేలియా పర్యటనకు ముందు.. రోహిత్, కోహ్లీకి 2027 వరల్డ్‌కప్ జట్టులో చోటు విషయమై అగార్కర్‌ను మీడియా ప్రశ్నించగా, వారిద్దరూ నాన్-కమిటల్ (ఎటూ తేల్చుకోకుండా)గా ఉన్నారని సమాధానమిచ్చాడు.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ