Share News

ఈ క్షణం..అద్భుతం

ABN , Publish Date - Aug 31 , 2026 | 03:48 AM

స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ‘టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లోకి శనివారం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో...

ఈ క్షణం..అద్భుతం

‘హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’ ప్రసంగంలో ఫెడరర్‌ భావోద్వేగం

న్యూపోర్ట్‌ (యూఎస్‌): స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ ‘టెన్నిస్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌’లోకి శనివారం అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ఫెడెక్స్‌ భావోద్వేగానికి లోనయ్యాడు. తానీస్థాయికి చేరేందుకు చేసిన కృషి, ప్రోత్సహించిన వ్యక్తులు, తీర్చిదిద్దిన కోచ్‌లను ప్రస్తావించాడు. ‘ఇదో గొప్ప సందర్భం. ఈ వేదికపై నిల్చోవడం అద్భుతమైన క్షణం. ‘హాల్‌ ఫేమ్‌’లో ప్రవేశంతో నా కెరీర్‌కు సంపూర్ణత చేకూరింది’ అని ఫెడరర్‌ పేర్కొన్నాడు. అంతకుముందు ఫెడరర్‌ భార్య మిర్కా..అతడిని సభికులకు పరిచయం చేసింది. అనంతరం వేదికపైకి చేరుకున్న ఫెడరర్‌ ఆమెను గట్టిగా హత్తుకొని తను ఇంత బాగా మాట్లాడుతుందని ఇప్పుడే తెలిసిందని నవ్వుతూ అన్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి

ప్లాస్టిక్ భూతం మధ్యన బోసిపోయిన రావిచెట్టు

‘టాక్సిక్‌‌’లో అసభ్యత తప్ప సమాజానికి ఉపయోగపడే సందేశం లేదు: రాజా

Updated Date - Aug 31 , 2026 | 03:48 AM