Share News

ఈ-సిగరెట్‌ తాగుతూ..

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:45 AM

రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ-సిగరెట్‌ తాగుతూ అతడు కెమెరాకు చిక్కాడు....

ఈ-సిగరెట్‌ తాగుతూ..

వివాదంలో రాజస్థాన్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌

సస్పెన్షన్‌ విధించే అవకాశం

ముల్లన్‌పూర్‌ (చండీగఢ్‌): రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌ రియాన్‌ పరాగ్‌ వివాదంలో చిక్కుకున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఈ-సిగరెట్‌ తాగుతూ అతడు కెమెరాకు చిక్కాడు. పంజాబ్‌ కింగ్స్‌తో మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌ సందర్భంగా ఈ ఉదంతం చోటుచేసుకుంది. రాజస్థాన్‌ చేజింగ్‌ 16వ ఓవర్‌లో పరాగ్‌ ఈ-సిగరెట్‌ తాగుతూ కనిపించాడు. ఆ సమయంలో అతడి పక్కన జురెల్‌ కూర్చుని ఉన్నాడు. అలాగే యశస్వీ జైస్వాల్‌ కూడా అక్కడ కనిపించాడు. బ్రాడ్‌కాస్టర్‌ కెమెరాను ఆవైపు తిప్పినప్పుడు ఆ దృశ్యం కంటపడింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో బాగా వైరల్‌ అవుతోంది.

భారత్‌లో ఈ-సిగరెట్లపై నిషేధం..

దేశంలో ఈ-సిగరెట్ల విక్రయం, వినియోగంపై 2019 నుంచి నిషేధం ఉంది. అలాంటిది పరాగ్‌కు అది ఎక్కడనుంచి వచ్చిందనేది చర్చనీయాంశమైంది. ఒకవేళ పరాగ్‌ ఈ-సిగరెట్‌ తాగాడని నిరూపితమైతే ఎలకా్ట్రనిక్‌ సిగరెట్ల నిషేధ చట్టం (పెకా) 2019 ప్రకారం అతడికి శిక్షపడే అవకాశముంది. ఈ చట్టం ప్రకారం జరిమానాతోపాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా విధించే చాన్సుంది. ఇంకా..బీసీసీఐ నిబంధనల ప్రకారం డ్రెస్సింగ్‌ రూమ్‌లు, డగౌట్లలో ధూమపానం నిషిద్ధం.. నిర్ణీత ప్రదేశాలలోనే ఽధూమపానం చేయాలి. ఈ నేపథ్యంలో 24 ఏళ్ల రియాన్‌పై బీసీసీఐ చర్యలు తీసుకొనే అవకాశాలున్నాయి. సస్పెన్షన్‌ వేటు పడొచ్చు. ఇటీవలే రాజస్థాన్‌ జట్టు మేనేజర్‌ రోమీ బింధర్‌ బెంగళూరుతో మ్యాచ్‌ సందర్భంగా డగౌట్లో మొబైల్‌ ఫోన్‌ వాడుతూ కనిపించాడు. దాంతో నిబంధనలు ఉల్లఘించిన బింధర్‌పై బీసీసీఐ రూ. లక్ష జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

సన్‌రైజర్స్‌తో మ్యాచ్.. ఎంఐ గెలుపు బాట పడుతుందా?

సల్మాన్ ఖాన్ పాత పోస్ట్‌కు రాజస్థాన్ రాయల్స్ రిప్లై.. వీడియో వైరల్

Updated Date - Apr 30 , 2026 | 03:45 AM