Rishabh Pant Injury: గాయంతో పంత్ దూరం
ABN , Publish Date - Jan 12 , 2026 | 05:49 AM
వికెట్ కీపర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను...
వడోదర: వికెట్ కీపర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్‌సకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్‌ను ఎంపిక చేశారు. శనివారం ప్రాక్టీస్ సెషన్‌లో పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పొత్తి కడుపు దగ్గర నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే అతడికి ఎంఆర్‌ఐ స్కాన్ చేయించినట్టు బీసీసీఐ పేర్కొంది. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిని బోర్డు మెడికల్ టీమ్ పర్యవేక్షిస్తున్నదని, ఈ కారణంగా పంత్ సిరీ్‌సకు దూరమవుతున్నట్టు తేల్చింది.
ఇవీ చదవండి:
ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..
ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..