Share News

WPL 2026 RCB Women : బ్యాటే ఆయుధంగా..

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:54 AM

రెండో సీజన్‌లో విజేతగా నిలిచిన ఉత్సాహంతో గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగింది. కానీ ఆ సీజన్‌ స్మృతి మంధాన...

 WPL 2026 RCB Women : బ్యాటే ఆయుధంగా..

డబ్ల్యూపీఎల్‌ 2 రోజుల్లో

బరిలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

రెండో సీజన్‌లో విజేతగా నిలిచిన ఉత్సాహంతో గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌)లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగింది. కానీ ఆ సీజన్‌ స్మృతి మంధాన నేతృత్వంలోని ఆర్‌సీబీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదింటిలో ఓడి.. ప్లేఆ్‌ఫ్సలో కూడా అడుగుపెట్టలేకపోయింది. అందుకే తాజా నాలుగో సీజన్‌లో ఎట్టి పరిస్థితుల్లోనూ కమ్‌బ్యాక్‌ ఘనంగా ఉండాలనుకుంటోంది.

బ్యాటింగ్‌, ఫినిషింగ్‌ అదుర్స్‌: ఆర్‌సీబీకి తమ బ్యాటింగ్‌ ఆర్డర్‌ ప్రధాన ఆయుధంగా చెప్పవచ్చు. స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధానకు జతగా జార్జియా వాల్‌ బరిలోకి దిగనుంది. ఇక మిడిలార్డర్‌ అద్భుత ఫినిషర్లతో పటిష్ఠంగా కనిపిస్తోంది. కీపర్‌ రిచా ఘోష్‌ హిట్టింగ్‌ ఎలా ఉంటుందో అభిమానులకు తెలిసిందే. ఇటీవలి వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటికే నిరూపించుకుంది. అటు గ్రేస్‌ హ్యారిస్‌, డిక్లెర్క్‌ స్ట్రోక్‌ ప్లేతో బౌలర్లకు కష్టకాలం తప్పదు. వీరికి తోడు స్పిన్‌ రిజర్వ్‌ బలం అదనం కానుంది. శ్రేయాంక పాటిల్‌, ప్రేమ్‌ రావత్‌, రాధా యాదవ్‌, లిన్సే స్మిత్‌ రూపంలో పరిస్థితులకు తగ్గట్టు బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉండనున్నారు.

ఎలిస్‌ పెర్రీ

దూరంతో..

గత మూడు సీజన్లలో ఆర్‌సీబీ తరఫున ఎలిస్‌ పెర్రీ అత్యంత కీలకంగా వ్యవహరించింది. నిలకడతో పాటు అవసరమైనప్పుడు దూకుడుగా ఆడేస్తూ జట్టుకు భారీ స్కోర్లు అందించడమే కాకుండా.. పేసర్‌గానూ సేవలందించింది. కానీ ఈ సీజన్‌కు ఆమె వ్యక్తిగత కారణాలతో దూరం కాబోతుండడం జట్టుకు అతిపెద్ద షాక్‌ అనే భావించాలి. ఇప్పుడు వన్‌డౌన్‌లో పెర్రీ స్థానాన్ని ఎవరితో భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. హేమలత, గౌతమీ నాయక్‌ పోటీలో ఉన్నారు. దీనికితోడు పేసర్‌ పూజా వస్ర్తాకర్‌ ఫిట్‌నె్‌సపై స్పష్టత లేకపోవడంతో అరుంధతి రెడ్డిపై అధిక భారం పడనుంది.


జట్టు:

స్వదేశీ: స్మృతి మంధాన (కెప్టెన్‌), రిచా ఘోష్‌, సయాలి సత్ఘరే, శ్రేయాంక పాటిల్‌, రాధా యాదవ్‌, ప్రేమా రావత్‌, అరుంధతి రెడ్డి, పూజా వస్త్రాకర్‌, గౌతమి నాయక్‌, ప్రత్యూష, హేమలత.

విదేశీ: జార్జియా వాల్‌, నాడిన్‌ డి క్లెర్క్‌, లారెన్‌ బెల్‌, లిన్సే స్మిత్‌, గ్రేస్‌ హ్యారిస్‌.

షెడ్యూల్‌

తేదీ ప్రత్యర్థి వేదిక

జనవరి 9 ముంబై నవీ ముంబై

జనవరి 12 యూపీ నవీ ముంబై

జనవరి 16 గుజరాత్‌ నవీ ముంబై

జనవరి 17 ఢిల్లీ నవీ ముంబై

జనవరి 19 గుజరాత్‌ వడోదర

జనవరి 24 ఢిల్లీ వడోదర

జనవరి 26 ముంబై వడోదర

జనవరి 29 యూపీ వడోదర

(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)

ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 07 , 2026 | 05:54 AM