RCB Safety Measures: ‘చిన్నస్వామి’లో ఏఐ కెమెరాలు
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:46 AM
గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయోత్సవం సందర్భంగా తొక్కిసలాట జరిగిన దృష్ట్యా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో కొన్నాళ్లుగా మ్యాచ్‌లు జరగడం...
రూ. 4.5 కోట్లతో ఆర్‌సీబీ ఆఫర్
బెంగూరు: గతేడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు విజయోత్సవం సందర్భంగా తొక్కిసలాట జరిగిన దృష్ట్యా ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో కొన్నాళ్లుగా మ్యాచ్‌లు జరగడం లేదు. అంతేకాదు.. సేఫ్టీ క్లియరెన్స్ ఉంటేనే మ్యాచ్‌లకు అనుమతిస్తామని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖరాఖండీగా చెప్పింది. దీంతో ‘చిన్నస్వామి’లో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లు జరగడంపైనా సందిగ్ధం నెలకొంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో రద్దీ నిర్వహణ, పటిష్ఠ భద్రతకు సంబంధించి ఆర్‌సీబీ యాజమాన్యం కొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. స్టేడియంలో ఏఐ (కృత్రిమ మేధ) ఆధారిత కెమెరాలను తాము ఏర్పాటు చేస్తామని కర్ణాటక క్రికెట్ సంఘం (కేఎ్‌ససీఏ)కు ఆర్‌సీబీ తెలిపింది. 300 నుంచి 350 కెమెరాలు ఏర్పాటు చేస్తామనీ, వీటికయ్యే ఖర్చు రూ. 4.5 కోట్లను భరిస్తామని ఆర్‌సీబీ పేర్కొంది. ఈ అధునాతన కెమెరాలు రద్దీని సమర్ధంగా నిర్వహించడం, క్యూలైన్ క్రమబద్ధీకరణ, భద్రతను పటిష్ఠం చేయడం లాంటి అంశాలకు దోహదం చేస్తాయని ఆర్‌సీబీ వివరించింది.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్