డబ్ల్యూఏపీఎల్ విజేత రాయలసీమ
ABN , Publish Date - Sep 28 , 2026 | 05:15 AM
రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో...
మంగళగిరి సిటీ (ఆంధ్రజ్యోతి): రాయలసీమ జెన్ స్టార్స్ జట్టు మహిళల ఆంధ్ర ప్రీమియర్ లీగ్ విజేతగా నిలిచింది. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్లో రాయలసీమ జట్టు ఆరు వికెట్లతో గోదావరి గోల్డెన్ ఈగల్స్‌ను చిత్తుచేసింది. తొలుత గోదావరి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 96 పరుగులు సాధించింది. హెన్రీటా పెరీరా 45 రన్స్ చేసింది. రాయలసీమ బౌలర్ ఆవుల శిరీష ధాటికి గోదావరి జట్టు పవర్ ప్లేలోనే 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ 17.1 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు శుభశ్రీ 30, సేతు సాయి 39 (నాటౌట్) రన్స్ చేశారు. విజేత రాయలసీమకు రూ.15 లక్షలు, రన్నరప్ గోదావరికి రూ.8 లక్షల నగదు ప్రోత్సాహకం లభించింది.
ఈ వార్తలూ చదవండి
ఏఐ ముప్పు.. ఆ తప్పు మాత్రం చేయొద్దు.. టెకీలకు హెచ్చరిక
నీటిలో మునగకుండా జాగ్వార్‌ను ఎలా కాపాడారంటే